Monday, December 23, 2024

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాతంగా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఓ) గిట్టె రిరణ్‌కుమార్ దినకర్‌రావు తెలిపారు. సాయంత్రం 3 గంటల వరకు రాష్ట్రంలోని 25.13 లక్షల ఓటర్లలో 69.96 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలలో ఒక సిపిఎం నాయకుడు, వామపక్షాలకు చెందిన ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు గాయపడ్డారు. ఆదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు పూర్తి కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News