Saturday, November 9, 2024

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -
Tripura CM Biplav
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం బిప్లబ్ దేబ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

న్యూఢిల్లీ: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తన రాజీనామాను గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు సమర్పించినట్లు శనివారం తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేయడం గమనార్హం. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం దేబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. “సంస్థను బలోపేతం చేయడానికి నేను పని చేయాలని పార్టీ కోరుకుంటోంది” అని బిప్లబ్ దేబ్ చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.

బిజెపి రాష్ట్ర శాఖలో అంతర్గత పోరు గురించిన నివేదికల నేపథ్యంలో ఆయన ఈ రాజీనామా చేశారు. కాగా త్రిపురలోని బిజెపి శాసనసభా పక్షం తన కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు తర్వాత సమావేశం కానుందని నివేదికలు చెబుతున్నాయి.శాసనసభా పక్ష నేత ఎన్నికకు పరిశీలకులుగా ఇప్పటికే త్రిపురలో ఉన్న బిజెపి సీనియర్ నేతలు భూపేందర్ యాదవ్, వినోద్ తావ్డేలను నియమితులయ్యారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర ఇంచార్జి వినోద్ సోంకర్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 25 ఏళ్ల పాలనకు ముగింపు పలికి, 2018లో బిప్లబ్ దేబ్ రాష్ట్రంలో మొదటి బిజెపి ముఖ్యమంత్రి అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News