- Advertisement -
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేవ్‌కు బుధవారం కరోనా పాజిటివ్ సోకింది. దీంతో స్వయం ఐసొలేషన్‌తో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. డాక్టర్ల సలహా మేరకు తాను ఐసొలేషన్ పాటిస్తున్నానని, ప్రతివారు కరోనా నిబంధనలు పాటించి భద్రంగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. దేవ్ నమూనాలను బుధవారం రాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ కనిపించిందని పశ్చిమ త్రిపుర జిల్లా వైద్యాధికారి డాక్టర్ సంగీత చక్రవర్తి చెప్పారు. దేవ్ కుటుంబీకులు ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ కనిపించింది.
Tripura CM Biplab Deb tests positive for COVID-19
- Advertisement -