Wednesday, January 22, 2025

జడ్జి చాంబర్‌లో అత్యాచార బాధితురాలికి లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

అగర్తల: తన చాంబర్‌లో ఒక అత్యాచార బాధితురాలిపై లైంగిక వేధింపులకు పల్పాడిన కమల్‌పూర్ సివిల్ జడ్జిపై త్రిపుర హైకోర్టు బదిలీ వేటు వేసింది. అత్యాచార బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జుడిషియల్ అధికారిని హైకోర్టుకు బదిలీ చేసి భవిత్యత్తు పోస్టింగ్ కోసం తప్పనిసరిగా వేచి ఉండాలని ఆదేశిస్తూ హైకోర్టు ఫిబ్రవరి 23న ఒక నోటిఫికేషన్ జారీచేసింది.

అత్యాచార బాధితురాలి ఆరోపణలపై ధలై జిల్లా సెషన్స్ జడ్జి గౌతమ్ సర్కార్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ఆరోపించింది. తనపై జరిగిన అత్యాచారానికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు తాను కమల్‌పూర్ ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ చాంబర్‌కు వెళలినపుడు తనపై జడ్జి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News