- Advertisement -
న్యూఢిల్లీ: త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి) బుధవారం ప్రకటించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరుగుతాయని, మేఘాలయ, నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగుతాయని సిఇసి ప్రకటించింది. మూడు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింంపు మార్చి 2న జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. మూడు రాష్ట్రాలలో కలిపి మొత్తం 62.8 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -