Monday, January 20, 2025

సొంత ఇళ్లకోసం అరణ్యవాసం

- Advertisement -
- Advertisement -

త్రిపురలో 40 కుటుంబాల నిరసనజెండ

అగర్తలా : తమకు ఉండటానికి ఇంత సొంత స్థలం కావాలనే డిమాండ్‌తో త్రిపురవాసులు రాత్రిపూట అడవులలో ఉంటున్నారు. ఈ విధంగా ఉత్తర త్రిపుర జిల్లాలకు చెందిన దాదాపు 30 నుంచి 40 కుటుంబాల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పెకూ చెర్రా జిల్లాకు చెందిన వారు ఈ జిల్లాలోనే అడవులను తమ రాత్రిపూట నివాస కేంద్రాలుగా ఎంచుకున్నారు. వీరు వేరే దిక్కులేక తమ ప్రాంతాలలోని ప్రభుత్వ స్థలాలలో ఇళ్లు కట్టుకున్నారు. ఎప్పటికైనా తమను ఖాళీ చేయిస్తారనే విషయం తెలియడంతో వారు తమకు శాశ్వత నివాసం కోసం ఈ విధంగా ఉద్యమించారు.

అడవులలో బస చేయడం ద్వారా ప్రభుత్వానికి తమ సమస్య తెలియచేయాలనుకుంటున్నామని వీరు తెలిపారు. అడవులలో వీరు గుడారాలు వేసుకుని, టార్పాలిన్ షీట్లతో తమ తలదాచుకుని ఉంటున్నారు. తాను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుడిని అని, ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నానని, అయితే ఇది అక్రమ నిర్మాణమని పేర్కొంటూ అధికారులు ఇల్లు ఖాళీ చేయించారని, ఇక్కడ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేశారని నామా అనే వ్యక్తి చెప్పారు. ఆవాస్ యోజన కింద తనకు శాశ్వత నివాసం దక్కే వరకూ తన నిరసన సాగుతుందని, తన లాగానే పలు కుటుంబాలు అడవుల బాట పట్టాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News