Monday, December 23, 2024

త్రిషపై అసభ్యకర మాటలు: విలన్ మన్సూర్‌పై కేసు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, వీరప్పన్ విలన్ మన్సూర్ అలీఖాన్ చిక్కుల్లో పడ్డారు. పేరు మోసిన నటి త్రిషపై అసభ్యకర పదజాలం వాడినందుకు ఖాన్‌పై కేసు దాఖలు అయింది. ఆయనపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం అయింది. తమిళనాడు డిజిపి శంకర్ జివాల్ వెలువరించిన ఆదేశాల మేరకు మన్సూర్ అలీఖాన్‌పై చర్యకు రంగం సిద్ధం అయింది. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా ఖాన్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో త్రిషతో కలిసి నటించడం లేదని, త్రిషతో కలిసి లియోలో నటించలేకపోయినందుకు బాధగా ఉందని చెపుతూ అశ్లీల పదజాలం వాడినట్లు వెల్లడైంది.

దీనిపై జాతీయ మహిళా కమిషన్ తనంతతానుగా స్పందించి విషయంపై రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేసి, తగు చర్యలకు దిగాలని సూచించింది. తెలుగు, తమిళ నటీనటులు, దర్శకులు ఇతర ప్రముఖులు మన్సూర్ వైఖరిని ఖండించారు. ఈ నేపథ్యంలో మన్సూర్‌పై చట్టపరమైన చర్యలకు వీలుంటుందని, అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News