Sunday, January 19, 2025

మొరాకో లో ఎంజాయ్ చేస్తున్న నటి త్రిష !

- Advertisement -
- Advertisement -

నటి త్రిష తన స్నేహితురాళ్లతో కలిసి మొరాకోలో ఎంజాయ్ చేస్తున్నారు. వారి జట్టులో అంతా యువతులే ఉండేసరికి ‘ఆల్ గళ్స్ ట్రిప్’ అంటున్నారు. త్రిష నటించిన సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(జివోఏటి) హిట్ కావడంతో ఆమె ఆనందంగా ఉన్నారు. అంతేకాదు ఆమె ఈ ట్రిప్ లో ఆ సినిమా ప్రొడ్యూసర్ అర్చనా కల్పతి, తదితర ఫ్రెండ్స్ ఉన్నారు.

త్రిష తన మొరాకో పర్యటన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె బ్లూ డ్రెస్ లో ఫోజులిచ్చింది. కొండల బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న తన ఫోటోకు త్రిష క్యాప్షన్ కూడా రాసింది. ‘‘ఎవరైతే  కొండ పైకి పర్యటిస్తారో వారు తమని తాము సగం ప్రేమిస్తారు. మిగతా సగం విషయానికొస్తే ఉపేక్షతో ప్రేమలో ఉంటారు’’ అని రాసింది. దీనిని నటి సమంత రుత్ ప్రభు ‘ఆమెన్’ అంటూ ఆమోదించింది.  ఇక రాధికా శరత్ కుమార్ ‘ఇన్నర్ బ్యూటీ’ అని రాసింది.

అర్చన కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. అందులో హాట్ ఎయిర్ బెలూన్ బ్యాక్ డ్రాప్ ఫోటో కూడా ఉంది. విజయ్, త్రిష తమ తాజా చిత్రంలో ‘‘అప్పడి పోడు…’’ పాటలో అభిమానులను అలరించారు. త్రిష ప్రస్తుతం అజిత్ కుమార్ సినిమా ‘విడాముయర్చి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అర్జున్ సర్జా, రెజినా కాస్సండ్రా, అరవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ లో , ఓ మలయాళం సినిమాలో నటిస్తున్నారు. త్రిష  వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ అనే తెలుగు సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కునాల్ కపూర్, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి రానున్నదని సమాచారం.

Trisha2

Trisha Friends

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News