Monday, December 23, 2024

అల్లుఅర్జున్-త్రిష కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్టు?

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ లో మూవీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ క్రేజీ కాంబో ట్రెండ్ అవుతోంది. ఇది నిజమైతే ఇక ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. ఇటీవల బాలీవుడ్ బాద్ షాతో జవాన్ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ. అంతకుముందే.. దేశవ్యాప్తంగా పుష్పరాజ్ గా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూవీకి ప్లాన్ జరుగుతున్నట్లు ఫిలీంనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులో బన్నికి జోడీగా నటించే అవకాశాన్ని త్రిష కొట్టేసిందంట. దాంతోపాటు మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారట. ఈ నలుగురు కాంబినేషన్ లో మూవీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే అభిమానులు ఆనందంలో మునిగిపోవడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News