Thursday, January 23, 2025

బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

అందాల తారా త్రిష ప్రస్తుతం తమిళంలో అజిత్‌కి జోడీగా ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ థగ్స్ లైఫ్ మూవీలో కూడా నటించే అవకాశం అందుకుంది. మణిరత్నం దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా త్రిష హిందీలో కూడా ఓ బంపర్ ఆఫర్‌ను అందుకుందట. 2010లో త్రిష హిందీలో అక్షయ్ కుమార్‌కి జోడీగా కట్టా మీటా సినిమాలో నటించింది. మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత హిందీలో మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది.

ఈ సారి ఏకంగా సల్మాన్ ఖాన్‌తో నటించబోతోంది. తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ది బుల్ అనే మూవీ చేస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మాల్దీవుల తిరుగుబాటును ఆపడానికి 1988 ఆపరేషన్ కాక్టస్ నిర్వహించిన బ్రిగేడియర్ ఫరూక్ బుల్సారా నేతృత్వంలోని భారత పారాట్రూపర్స్ బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఫరూక్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తుండగా అతని భార్యగా త్రిష కనిపించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News