Sunday, April 20, 2025

పెళ్లి కాకపోయినా పర్వాలేదు.. త్రిష కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న హీరోయిన్ త్రిష పెళ్లిపై కీలక కామెంట్స్ చేశారు. కమల్ హాసన్, లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో త్రిష పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెళ్లిపై మీ ఓపినియన్ ఏంటన యాంకర్ అడిగారు. దానికి త్రిష బదులిస్తూ.. వివాహంపై తనకు సరైన ఉద్దేశం లేదని చెప్పింది. తనకుపెళ్లి అయినా పర్వాలేదు.. కాకపోయినా ఫర్వాలేదని సమాధానం ఇచ్చింది. కాగా, గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే అతనితో త్రిష విడిపోయింది. ప్రస్తుతం ఆమె సింగల్ గానే ఉంటోంది.

కాగా, త్రిష సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల అజిత్‌తో కలిసి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో త్రిష నటించింది. ఈ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటివరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. ఇక, ‘థగ్ లైఫ్’ సినిమాతోపాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News