Thursday, January 23, 2025

హారానికి దారంలా పని చేశారు త్రివిక్రమ్

- Advertisement -
- Advertisement -

 

పవన్‌కల్యాణ్-, రానా కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయ క్’. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. సాగర్.కెచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. శనివారం ఈ చిత్రం పవర్‌ఫుల్ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ “ఈ సినిమా మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పబడింది. భీమ్లా నాయక్ వైపు తీసుకురావడానికి ఎలా బ్యాలెన్స్ చేయాలి… అనేది ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పుడు మాకు ఎదురైన తొలి సవాల్. కథను ఎలా మార్చుకురావాలి అన్న దానిపై మా చర్చలు మొదలయ్యాయి.

అడవికి సెల్యూట్ చేస్తూ ‘భీమ్లానాయక్’ క్యారెక్టర్‌ను అడవికి మరింత దగ్గర చేస్తే అతనికి జస్టిఫికేషన్ దొరుకుతుందనిపించింది. మాతృక నుంచి బయటకు రావడానికి మేం చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి భీమ్లా అయినా ఉండాలి.. లేదా డ్యాని అయినా ఉండాలి… లేదంటే ఇద్దరూ ఫ్రేమ్‌లో ఉండాలి. అందుకే క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరూ ఉండేలా చేశాం. పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్‌తో సినిమా అంటే చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అభిమానులు ప్రేక్షకులు కోరుకునే అంశాలు మిస్ కాకుండా ఉండాలి. అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి మేం ఎక్కువ కష్టపడ్డాం. ఆ తర్వాత అన్నీ సులభంగా జరిగిపోయాయి” అని అన్నారు. దర్శకుడు సాగర్.కెచంద్ర మాట్లాడుతూ “హారానికి దారం.. అన్నట్లు మా అందరినీ కలుపుకొని కథకు ఏం కావాలో… సాంకేతిక నిపుణులు ఎవరైతే బెస్ట్ అని చూసి ఈ సినిమాకు దారంలా పని చేశారు త్రివిక్రమ్. సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచారు. కథలోకి వెళ్లి దానికి ఎలాంటి సంగీతం కావాలో అర్థం చేసుకుని మ్యూజిక్ అందించారు తమన్‌” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమన్, రామజోగయ్య శాస్త్రి, కాసర్లశ్యామ్, సంయుక్తా మీనన్, ప్రియంక, గణేశ్ మాస్టర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News