Monday, January 20, 2025

పవన్ సినిమాకు త్రివిక్రమ్ టైటిల్..

- Advertisement -
- Advertisement -

ఓ పక్క సూపర్‌ప్టార్ మహేష్ సినిమా చేస్తూనే మరో పక్క పవర్‌ప్టార్ పవన్ సినిమాల విషయంలో అన్నీ తానై నడిపిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్, త్రివిక్రమ్ స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ ప్రతి సినిమాలో త్రివిక్రమ్ జోక్యం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ ఏదైనా రీమేక్ చేస్తున్నాడు అంటే ఈ దర్శకుడి ఫుల్ హ్యాండ్ ఉండాల్సిందే. ప్రస్తుతం పవన్ తమిళ సినిమా ‘వినోదయ సీతం’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగు వర్షన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ టాకీ పార్ట్‌ని ఈ మధ్యనే పూర్తి చేశారని తెలుసింది.

అయితే ఈ సినిమాకు ఒక మంచి టైటిల్ అనుకున్నారట త్రివిక్రమ్. తనకు వచ్చిన టైటిల్ ఐడియాని పవన్‌తో చెబితే ఓకే సూపర్ అని అనేశారట. త్రివిక్రమ్ ఏం చేసినా దానికి సంథింగ్ స్పెషల్ ఉంటుందని ఈ స్టార్ హీరో నమ్మకం. ఈ సినిమాలో పవన్‌తో పాటు అతని మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా నటిస్తున్నాడు. మామ అల్లుడు కలిసి మెగా ఫ్యాన్స్‌కి సూపర్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరి కల్లా విడుదల చేయాలని చూస్తున్నారు.

పవన్ ఈ సినిమాతో పాటుగా హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు చేస్తున్నారు.మే నెల మొత్తం సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కే ఓజీ సినిమా కోసం డేట్స్ ఇచ్చారట పవన్. కమిటైన సినిమాల వరకు ఈ ఏడాది చివరి కల్లా తన పని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు పవన్. ‘హరి హర వీరమల్లు’ కూడా ఈ ఏడాది రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News