Wednesday, January 22, 2025

ఆంధ్రా సరిహద్దున ట్రాలీ బోల్తా

- Advertisement -
- Advertisement -

బూర్గంపాడు : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మూడు కుటుంబాలు దైవదర్శనం అనంతరం తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో నలుగురు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల సరిహద్దులోని ఆంధ్రా వేలేరుపాడు మధ్యలో ఓ బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం& ఏలూరు టి.నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన బి.నర్సింహారావు, జట్ల దుర్గారావు, పచ్చిసాని శ్రీనివాసరావులకు చెందిన 12 మంది కుటుంబసభ్యులు మంగళవారం భద్రాచంలో శ్రీ సీతారామచంద్రస్వామి దైవదర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ట్రాలీ ఆటోలో స్వగ్రామమైన తిరుమలదేవిపేటకు వెళుతుండగా బూర్గంపహాడ్ సరిహద్దులో వేలేరుపాడు మండలానికి సమీపంలో కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు వద్దకు వెళ్లగానే వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న బ్రిడ్జి కిందకు పల్టీకొట్టింది.

ఈ సంఘటనలో దుర్గారావు (40), శ్రీనివాసరావు (35)లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన పడిన వారిని పోలీసులు, స్థానికులు చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ సందీప్ (12), ప్రదీప్ (10)ల పరిస్థితి విషమంగా మారి చికిత్స పొందుతూ మృతిచెందారు. మిగిలిన వారికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మృతులందరికీ ఒకే గ్రామం కావడం విశేషం. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సంతోష్ సిబ్బందితో కలిసి పరిశీలించి మృతికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News