Friday, December 20, 2024

ఇదేం ట్రోలింగ్ రా బాబు.. దేవిశ్రీ ప్రసాద్, థమన్ లపై తగ్గేదే లే అంటున్న ట్రోలర్స్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ సంగీత దర్శకులు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ థమన్ లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. పాత పాటలు కాపీ కొడుతున్నారని ట్రోలర్స్ వీరిద్దరినీ ఓ ఆట ఆడుకుంటున్నారు. మొదట థమన్ ఎక్కువగా కాపీ ఆరోపణలు ఎదుర్కొనగా.. ఇప్పుడా జాబితాలోకి దేవీ కూడా చేరిపోయాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేర్ వీరయ్య’సినిమా నుంచి బాస్ పార్టీ అనే సాంగ్ విడులైన విషయం తెలిసిందే. అయితే, ఈ పాట మ్యూజిక్ లవర్స్ ఆకట్టుకుంటున్నా.. ట్రోలింగ్ లిస్ట్ లో చేరిపోయింది. తన పాటను తనే కాపీ కొట్టాడంటూ దేవిపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఆడుకుంటున్నారు.

ఇక, బాలకృష్ణ నటిస్తున్న మాస్ మూవీ ‘వీర సింహారెడ్డి’కి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య పాటపై సోషల్ మీడియాలో జోరుగా ట్రోలింగ్ జరుగుతుంది. ఈ పాటను ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ సాంగ్ తో పోలుస్తూ థమన్ ను ట్రోలర్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇక, ఈ రెండు సినిమాల నుంచి రానున్న మిగతా పాటల కోసం కొత్త ట్యూన్స్ తో అలరిస్తారో? లేక మళ్లీ ట్రోలర్స్ చేతుల్లో చిక్కుకుంటారో? చూడాలి మరి.

Trolling on Devi Sri Prasad and S S Thaman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News