Sunday, December 22, 2024

పాకిస్థాన్ టీమ్‌పై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్

- Advertisement -
- Advertisement -

టి20 ప్రపంచకప్‌లో అత్యంత చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్ టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా వంటి అనామక జట్టు చేతిలో ఓటమి పాలు కావడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. జట్టు పేలవ ప్రదర్శనకు సీనియర్ క్రికెటర్ల వైఫల్యమే కారణమని వాపోతున్నారు.

జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ పూర్తిగా తేలిపోయాడని, అతనితో పాటు రిజ్వాన్, హారిస్ రవూఫ్, ఫకర్ జమాన్ తదితరులు ఘోరంగా విఫలమయ్యారని, వీరిని వెంటనే జట్టు నుంచి ఉద్వాసన పలకాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. షహీన్ అఫ్రిది కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని వారు విమర్శిస్తున్నారు. జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీనియర్లు జట్టు నుంచి తప్పుకోవాలని వారు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News