Saturday, November 16, 2024

ఎంఎల్‌సి కవితపై అసభ్యకర ట్రోల్స్: క్రైమ్ డిసిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫొటోలు మార్ఫింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిని పోలీసులు గుర్తించడంతో పాటు 20 కేసులు నమోదు చేశారు. ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 30 మంది ట్రోలర్స్‌కు నోటీసులు ఇచ్చామని పోలీసులు వెల్లడించారు. అసభ్యకర పోస్టులు, ఫొటో మార్ఫ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని క్రైమ్ డిసిపి స్నేహా మెహ్రా వెల్లడించారు.

ఎక్కువగా యువత ట్రోలింగ్‌కు పాల్పడుతోందని, టిఆర్‌పి, సబ్‌స్కైబర్స్, వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నారని తెలిపారు. ఎంఎల్‌సి కవితపై ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్స్ జరిగాయని, కవితను కించపరిచే విధంగా, అసభ్యకరంగా ట్రోల్స్ చేశారని, మహిళలపై కూడా అత్యధికంగా ట్రోల్స్ జరుగుతున్నట్టు గుర్తించామని, అసభ్యకర పోస్టులు, ఫొటో మార్ఫ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్నేహా మెహ్రా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News