Thursday, January 23, 2025

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులను నిరసిస్తూ కీసరలో ధర్నా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కీసరః మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసాలు, కళాశాలలపై ఐటీ దాడులను నిరసిస్తూ బుధవారం కీసరలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో కీసర ప్రధాన చౌరస్తాలో నాలుగు వైపులా కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కీసర మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగానే మంత్రి మల్లారెడ్డి నివాసాలు, కళాశాలలపై దౌర్జన్యంగా ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

తన కళాశాలలు, సేవా సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంత్రి మల్లారెడ్డిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బీజేపీ నాయకులు పద్దతి మార్చుకోకుంటే ప్రజలు తరిమి కొట్టి తగిన బుద్దిచెబుతారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎం.ఇందిర లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, సర్పంచులు ఎన్.మాధురి వెంకటేష్, పి.పెంటయ్య, కె.గోపాల్‌రెడ్డి, ఎం.విమల నాగరాజు, పి.రాజు ముదిరాజ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News