ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరసర దూషణలు
మన తెలంగాణ/హుజూరాబాద్: హుజూరాబాద్‌లో గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి టిఆర్‌ఎస్ వర్గాల మద్య జరిగిన ఘర్షణతో ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో సమస్య సద్దు మణిగినా రెండు వర్గాల మధ్య గంట సేపు తోపులాట, ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముందు దళితులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టిఆర్‌ఎస్ దళిత సంఘం ఆధ్వర్యంలో ఈటల బావమరిది మధుసూదన్‌రెడ్డి శవయాత్ర నిర్వహించారు. దీన్ని నిరసిస్తూ ఈటల జమున తన సోదరుడిపై కెసిఆర్ ప్రగతి భవన్ నుంచి కుట్రలు చేస్తు న్నారన్నారు. దాదాపు వంద మంది బిజెపి కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయగ ఆమె కేసిఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ దశలో టిఆర్‌ఎస్‌కు చెందిన దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈటల దళిత ద్రోహి అంటూ ప్లెక్సీని పట్టుకొని అంబేద్కర్ విగ్రహం వైపు వచ్చారు. ఈటల జమున టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్‌పై విమర్శలు కురిస్తుండగా ఈటల డౌన్‌డౌన్ అంటూ టిఆర్‌ఎస్ దళిత సంఘాల కార్యకర్తలు నినాదాలు చేయగా కేసిఆర్ డౌన్‌డౌన్ అంటు బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ద శలో ఒకరిపై ఒకరు తోపులాట, చెప్పులతో విసురుకోవడం జరిగింది. ఈ ఘర్షణ విషయం తెలిసిన స్ధానిక సిఐ శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో పోలీసులు ఇరువర్గాలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే టిఆర్‌ఎస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ఈటల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా బిజెపి కార్యకర్తలు సైతం రోడ్డుపై బైఠాయించి కేసిఆర్ డౌన్‌డౌన్ అం టూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని టిఆర్‌ఎస్ దళిత నాయకులను పిఎస్‌కు తరలించారు. అనంతరం బిజెపి తన కార్యక్రమాలను కొనసాగించారు.
కేసిఆర్ స్కిప్ట్ ప్రకారమే మా కుటుంబంపై దాడులు : ఈటల జమున
ప్రగతి భవన్ నుండి కేసిఆర్ నాయకత్వంలో జరుగుతున్న కుట్ర, కుతంత్రాలలో భాగంగా హరిశ్‌రావు సారధ్యంలో తమ కుటు ంబంపై పతకం ప్రకారం దాడులు చేస్తున్నారని, ఇందులో భాగంగా దళితులను తమ సోదరుడు అవమాన పరిచినట్లు సోషల్ మీ డియా ద్వారా తప్పుడు పోస్టులు సృష్టిస్తున్నారని అన్నారు. తమ కుటుంబంపై జరుగుతున్న దాడుల్లో భాగంగా తమ సోదరుడిని పాఠశాలపై కూడా కేసిఆర్ దాడులు చేయించారని, ఏం దొరకకపోయే వరకు ఇందులో ఇరికించాలని చూస్తున్నారన్నారు. కాగా ఈ విషయమై స్ధానిక పోలీస్ స్టేషన్‌లో టిఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయడానికే ఇక్కడికి వచ్చానని ఈటల బావమరిది మధుసూదన్‌రెడ్డి తెలిపారు. తాను దళితులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
మధుసూదన్‌రెడ్డి శవయాత్రలు
దళితులపై అవమాన పరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఈటల బావమరిది మధుసూదన్‌రెడ్డి శవయాత్రను హుజూరాబాద్ నియో జకవర్గంలోని అన్ని మండలాలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు.
TRS and BJP activists clash in Huzurabad