Monday, December 23, 2024

రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు

- Advertisement -
- Advertisement -

వద్దిరాజు, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక స మీకరణలను పరిశీలించిన మీదట రెడ్డి, వెలమ, మున్నూరు కాపు సా మాజిక వర్గాలకు చెందిన వారికి ఎం పిక చేశారు. రాజ్యసభ అభ్యర్థులు గా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండి దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, గాయత్రి గ్రానైట్ సంస్థ అధిపతి వద్దిరాజు రవిచంద్ర (గాయ త్రి రవి)లకు అవకాశం కల్పిస్తూ బు ధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఒసి వర్గానికి చెందిన వారు కాగా, బిసి వర్గానికి చెందిన వా రు కావడం విశేషం.తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థా నాలకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలు కాగా, శాసనసభ్యుల సం ఖ్యాబలం దృష్ట్యా మూడు స్థానాలనూ టిఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమేనని తెలుస్తోంది. కాగా ఎంపికైన రాజ్యసభ అభ్యర్ధులు ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిశారు. రాజ్యసభ అభ్యర్ధులుగా ఎంపిక చేసినందుకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ ముగ్గురికి బి.. ఫారాలను ఆయన అందజేశారు.

వద్దిరాజు

తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్న వద్దిరాజు రవిచంద్ర 1964, మార్చి 22న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో జన్మించారు. ఈయనకు భార్య విజయలక్ష్మి, కూతురు గంగా భవాని, కుమారుడు సాయి నిఖిల్ చంద్ర ఉన్నారు. తెలంగాణ మున్నూరుకాపు ఆల్ అసోసియేషన్ జెఎసి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. తన సొంతూరులో బడులు, గుడులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌకర్యాలను కల్పించి గ్రామస్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ప్రతి పండుగకు తన వంతు ఆర్థిక సాయం చేసి అంగరంగ వైభవంగా జరిగేలా సహకరించారు.

దీవకొండ దామోదర్ రావు

తెలంగాణ ఉద్యమ ప్రస్తానంలో కెసిఆర్‌తో నడిచిన వ్యక్తుల్లో దీవకొండ దామోదర్ రావు కూడా ఒకరు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన ఆయన 1958 ఏప్రిల్ 1న జన్మించారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. 2001 నుంచి టిఆర్‌ఎస్ పార్టీలో పలు హోదాల్లో పని చేశారు. ప్రస్తుటం టి..న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికల స్థాపనలో ఆయనది ప్రధాన భూమిక. టి.. న్యూస్ చానెల్‌కు తొలి మేనేజింగ్ డైరెక్ట్‌ర్‌గా వ్యవహరించిన దామోదర్ రావు.. ప్రస్తుతం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

పార్థసారథిరెడ్డి

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బండి పార్థసారథిరెడ్డి హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కాగా కందుకూరులో డిగ్రీ పూర్తి చేసి ఒక ప్రయివేటు కంపెనీలో పని చేస్తూనే హెటిరో సంస్థను స్థాపించారు. తన సంస్థ ద్వారా దాదాపు పది వేల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. స్వగ్రామమైన కందుకూరులో కల్యాణమండపం, సాయిబాబా దేవాలయాన్ని నిర్మించారు. పలు విద్యాసంస్థలు స్థాపించారు. ఆపదలో ఉన్న వారికి గుప్తదానాలు చేస్తారన్న పేరు కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News