వ్యవస్థాపక దినోత్సవాన్ని
ఘనంగా జరపాలని నిర్ణయం
వేదిక మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసి సభలో 11తీర్మానాలు పెట్టనున్న పార్టీ
టిఆర్‌ఎస్‌ను స్థాపించి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా
సింహావలోకనం, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్తులో
పోషించాల్సిన పాత్ర, ప్రజల మనసులు గెలుచుకొని అధికారానికి
రావడానికి అనుసరించాల్సిన వ్యూహంపై సమగ్ర చర్చ హాజరుకానున్న
రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు శాసన మండలి, శాసనసభ
సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లా
అధ్యక్షులు, జడ్‌పి చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు తదితరులు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఈ 27వ తేదీన మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసి ప్రాంగణంలో జరపాలని తలపెట్టింది. ఈ వేడుకల్లో మొత్తం పార్టీ 11 తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. టిఆర్‌ఎస్‌ను స్థాపించి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తిఅవుతున్న సందర్భంగా రెండు దశా బ్దాల పార్టీ ప్రస్థానంలో సాధించిన విజయాలు.. ఎదుర్కొన్న సవాళ్లతో పాటు భవిష్యత్ రాజకీయా ల్లో పోషించాల్సిన పాత్ర… అనుసరించాల్సిన వ్యూ హాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పైగా అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సరన్నర వ్యవధి మాత్రమే ఉండడంతో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఆవిర్భావ వేడుకలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇరవైఒక సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పా టు చేసిన సమయంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో…. అలాంటి ఆదరణతో ముచ్చటగా మూడవ సారి టిఆర్‌ఎస్‌కు అధికారాన్ని కట్టబెట్టాలన్న వ్యూహాలను సిఎం కెసిఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.
ఈ మేరకు పార్టీ ప్రతినిధులంతా ఆవిర్భావ వేడుకలకు ఉదయం 10 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆదేశించారు. కాగా ఉదయం 10 గంటల నుంచి 11గంటలవరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం కొనసాగనుంది. 11.05గంటలకు పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. పార్టీ పతాకావిష్కరణ, స్వాగతోపన్యాసం అనంతరం ఆయన ప్రసంగం ఉంటుం ది. సమావేశంలో ప్రవేశపెట్టిన మొత్తం 11 తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఈ సభ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ వ్య వస్థాపక దినోత్సవంలో మంత్రులు, పార్లమెంటు సభ్యులు, మండలిసభ్యులు, శాసనసభ్యు లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, వివిధ సంస్థల కార్పొరేషన్ల ఛైర్మ న్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కో ఆర్డినేటర్లు, జెడ్‌పిటిసి సభ్యులు, మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్లు, మం డల పరిషత్ అధ్యక్షులు, పట్టణాలు, మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయమార్కెట్ కమిటీ ఛైర్మ న్లు పాల్గొననున్నారు.
కాగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్‌సిలు, మాజీ శాసనసభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. కాగా సమావేశంలో చర్చించాల్సిన తీర్మానాలనుఖరారు చేసేందుకు పార్టీలోని పలువురు నేతలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే సభా ప్రాంగణ వేదికతో పాటు నగర అలంకరణ, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ప్రజాప్రతినిధుల నమోదు కోసం పలు కమిటీలను ఒకటి, రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది.