- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్ధి వద్దిరాజు రవిచంద్రకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి అజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం దకుతున్నదని అన్నారు.
TRS Candidate Vaddiraju Ravichandra nomination for RS Polls
- Advertisement -