మన తెలంగాణ/హైదరాబాద్: వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆందోళన చేయాలని టిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఛలో ఢిల్లీకి టిఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. తొలుత జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చివరికి తెలంగాణ భవన్‌లో ఆందోళన చేయాలని టిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు వరిధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ టిఆర్‌ఎస్ ఆధ్వర్య ంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నెల 11న న్యూఢిల్లీలో ఆందోళనలు చేయాలని టిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ ఆందోళనలపై టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ నేతలతో చర్చించారు. వరిధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ తరహా పోరాటం చేస్తామని కెసిఆర్ ఇదివరకే ప్రకటించారు.
ఈ నెల 11న ఢిల్లీలో ఆందోళన తర్వాత కూడా కేంద్రం నుండి స్పందన రాకపోతే ఏం చేయాలనేదానిపై కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒకే విధానం ఉండాలని టిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. పంజాబ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేస్తున్నట్లుగానే తమ రాష్ట్రం నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కూడా టిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై గతంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో కూడా తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. అయితే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలంగాణ తీరును తప్పుబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయత్నాలు చేస్తోందని పియూష్ గోయల్ మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలలో ఎలా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామో తెలంగాణ నుండి కూడా వరిధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రంపై వరిధాన్యం విషయమై టిఆర్‌ఎస్ ఎంపిలు ఏదో ఒక రూపంలో నిరసనకు దిగుతున్నారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి నేతలు రాష్ట్ర రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని కూడా టిఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు.
TRS Chalo Delhi protest on April 11th over Paddy