జయాపజయాలను ప్రభావితం చేస్తున్న ఒకే రకమైన గుర్తులు
2018లో జహీరాబాద్‌లో బుల్డోజర్‌కు 4330 ఓట్లు, అదే సిపిఎంకు 1036 ఓట్లు నర్సంపేటలో
కెమెరా గుర్తుకు 9052 ఓట్లు బిజెపి, బిఎస్‌పిలకు కలిపి 2612 ఓట్లే కారును పోలిన
ఈ గుర్తులపై టిఆర్‌ఎస్ ఆందోళన హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్.. నేడు విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్: కారును పోలిన ఎన్నికల గుర్తులు రోడ్డు రోలర్.. కెమెరా.. చపాతీ రోలర్.. టెలివిజన్, షిప్, డోలీ వంటి ఎనిమిది గుర్తులు టిఆర్‌ఎస్ నేతలను వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో వరుస ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ఈ గుర్తుల ప్రభావం చూపడంతో ఈ టిఆర్‌ఎస్ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. గుర్తింపు పొందిన పార్టీలు సాధించిన ఓట్ల కంటే ఈ గుర్తులు పొందిన ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓట్లు ఒక్కోసారి ఎక్కువగా ఉంటున్నాయి. ము నుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ రగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన ఉన్న ఎనిమిది గుర్తులను తొలగించాలని కోరుతూ భారత ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే టిఆర్‌ఎస్ కోరింది. ఎ న్నికల సంఘం స్పందన రాకపోవడంతో న్యాయస్థానాన్ని టిఆర్‌ఎస్ ఆశ్రయించిం ది. గుర్తులు ఒకే విధంగా ఉండడంతో గ్రా మీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు, వృద్ధ ఓటర్లు టిఆర్‌ఎస్ కారును గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ను గందరగోళానికి గురిచేయడానికి ప్ర త్యర్థులు కారును పోలిన గుర్తును ఉపయోగించుకుంటున్నారని టిఆర్‌ఎస్ నేత లు ఆరోపిస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ అసెంబ్లీ స్థానంలో రోడ్ రోలర్ గుర్తుకు 4,330 ఓట్లు వచ్చాయని, సిపిఎంకు 1,036 ఓట్లు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా నర్సంపేటలో కెమెరా గుర్తుకు 9,052 రాగా, రెండు జాతీయ పార్టీలైన బిజెపి, బిఎస్‌పిలకు 2,612 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇవిఎం మెషిన్లలో కారును గుర్తించడంలో ఓటర్లను తికమక పెట్టేందుకు కారును పోలిన ప్రతిపక్ష పార్టీలు సద్వినియోగం చేసుకున్నాయని నేతలు ఆరోపించారు. గతంలో జరిగిన పలు ఎన్నికల సరళిని పరిశీలిస్తే స్వతంత్ర అభ్యర్థులుగా చెప్పుకునే వీరు టిఆర్‌ఎస్ ఓట్లను ఎలా చీల్చుతున్నారో, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల అవకాశాలను ఎలా దెబ్బతీస్తున్నారో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైన విజయం సాధించాలని అధికార టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో టిఆర్‌ఎస్ అభ్యర్థన మేరకు ఉచిత చిహ్నాల జాబితా నుంచి టోపీ, ఇనుప పెట్టె, ట్రక్, ఆటోరిక్షా మొదలైన చిహ్నాలను తొలగించారు. చపాతీ రోలర్, కుట్టుమిషన్, కెమెరా, సబ్బు డిష్, టెలివిజన్, ఓడ, కుట్టు మిషన్ వంటి టిఆర్‌ఎస్ ఎన్నికల గుర్తును పోలి ఉండే ఉచిత చిహ్నాలు ఓటర్లను గందరగోళానికి గురిచేస్తాయని ఎన్నికల సంఘం దృష్టికి, న్యాయస్థానం దృష్టికి పార్టీ తీసుకెళ్లిందని టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ తెలిపారు.
హైకోర్టులో విచారణ
మునుగోడు ఉపఎన్నికలో గుర్తులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిష్‌న్‌ను సోమవారం ఉదయం అధికార టిఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసింది. కాగా, లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అత్యవసర విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. నవంబర్ 3న ఎన్నికలు ఉన్నందున ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదని టిఆర్‌ఎస్ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ పిటిషన్‌పై మంగళవారం విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు.