Saturday, November 23, 2024

ఈటెల చేయలేని అభివృద్ధి టిఆర్ఎస్ పూర్తి చేస్తుంది: గంగుల

- Advertisement -
- Advertisement -

ఈటెల నిర్లక్ష్యంతో హుజురాబాద్ లో కుంటు పడ్డ అభివృద్ధిని టిఆర్ఎస్ పూర్తి చేస్తుంది

70కోట్లతో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు

తెలంగాణ ఇంటి పార్టీ టిఆర్ఎస్ ముద్దు, ఢిల్లీ గులాము పార్టీలు వద్దు

సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలే టిఆర్ఎస్ ఎజెండా

గెల్లును గెలిపించండి, అభివృద్ధికి మద్దతివ్వండి

హుజురాబాద్ ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్

TRS concerntrate on development

కరీంనగర్: ప్రజల్లోంచి వచ్చిన నాయకుడే ప్రజలతో మమేకం కాగలుగుతారని, వారి సమస్యలపై సానుభూతితో ఉండి పరిష్కరించగల్గుతారని, అలాంటి నాయకుడు మనకు కావాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం హుజురాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కలిసి ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో గంగుల  ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమవుతూ ప్రతీ అవ్వ, అయ్య చెంతకు వెల్లి ఓపికగా వారి మంచి చెడులను గుంగుల అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకు పూర్వం వారి బాధల్ని చెబుతున్నప్పుడు తన కళ్లు చెమ్మగిల్లాయని, ఇప్పుడు వారికి అందుతున్న సౌకర్యాలతో, సిఎం కెసిఆర్ ను ఇంటి పెద్ద కొడుకుగా చెబుతుండడంతో తన హృదయం ఉప్పొంగిపోయిందన్నారు. దారి పొడువునా వేల సంఖ్యలో ప్రజలు ఎదురుగా వచ్చి అడుగడుగునా పూలు చల్లుతూ, హారతులిస్తూ మంత్రి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ప్రజలు, ప్రతీ చోట స్థానికులను కలుస్తున్నప్పుడు సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వాళ్లే వివరిస్తున్న తీరుతో మంత్రి గంగుల ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు కెసిఆరేనని అందుకే ప్రతీ ఒక్కరి అవసరాలు తీరే విధంగా పథకాల్ని రూపొందించారని గంగుల ప్రశంసించారు. ప్రచారంలో భాగంగా గుంగుల మాట్లాడారు. కెసిఆర్ కిట్, గురుకులాలు, కళ్యాణలక్ష్మీతో జీవితంలో ప్రతీ దశలో తోడుగా ఉండే పథకాలతో పాటు రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, ఆసరా ఫించన్లు తదితర పథకాలతో జీవితాలను మార్చారని కొనియాడారు. కుల వృత్తి చేసుకునేవాళ్లకు అండగా రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు, కుమ్మరులకు ఆధునిక యంత్రాలు, ముదిరాజులు, గంగపుత్రులకు మోపెడ్లు, చాపపిల్లల పంపిణీ, గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, దళితులకు దళితబందు వంటి పథకాలతో ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటున్న ప్రభుత్వం టిఆర్ఎస్ కొనియాడారు. ఒకనాడు బీడుభూములతో, కాలిపోయిన మోటార్లతో పడిన అవస్థలన్నీ కాళేశ్వర జలాలతో తొలిగిపోయాయని తెలియజేశారు.

నర్సింగాపూర్, బోర్పల్లి రోడ్లు ఎంతో అధ్వాన్నంగా ఉన్నాయని, హుజురాబాద్ లో ఎక్కడ చూసినా అభివృద్ధి కుంటుపడిందన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకుంటే కాడి వదిలేసి పారిపోయిన వ్యక్తి మళ్లీ ఓట్లకోసం ఎలా వస్తున్నారని మండిపడ్డారు. ఇరవై ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని వ్యక్తి రేపు ప్రతిపక్షంలో ఉండి ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పల నర్సింగాపూర్ వాసులు అడిగిన మరుక్షణమే రోడ్డును మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం పనులు నడుస్తున్నాయని, తెలంగాణ సాధించిన ఇంటి పార్టీ టిఆర్ఎస్ అని, తెలంగాణ ప్రజలు తయారు చేసుకున్న ఆయుధం కెసిఆర్ అని, చావు నోట్లో తలపెట్టి మన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం రాష్ట్రాన్ని కెసిఆర్ సాధించారన్నారు. అన్నం పెట్టిన పార్టీని ఆశీర్వదించాలన్నారు. ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలను తిరస్కరించాలన్నారు. కెసిఆర్ పంపిన పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని అతన్ని ఆశీర్వదించి గెలిపించాలని గంగుల కోరారు. గెల్లుతో పాటు జిల్లా మంత్రిగా తాను కెసిఆర్ దగ్గర హుజురాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం నిధుల్ని సాధిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News