Monday, December 23, 2024

సై ప్యాక్

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల కోసం పికెకు చెందిన ఐప్యాక్ సేవలు
కొనసాగించాలని టిఆర్‌ఎస్ నిర్ణయం

రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై
సేకరించిన జనాభిప్రాయం గురించి
సమగ్ర నివేదిక సమర్పించిన పికె
మళ్లీ కలుసుకోనున్న
కెసిఆర్-ప్రశాంత్ కిశోర్

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజాభియం తెలుసుకోడానికి
ఐప్యాక్ సేవలు కొత్త ఓటర్ల నాడిని పసిగట్టడం తెలంగాణ
ఉద్యమంలో కెసిఆర్ పాత్ర, తదితర అంశాలపై ప్రజలు
ఏమనుకుంటున్నారో పసిగట్టడం వగైరా అంశాలలో ఐప్యాక్‌ను
వినియోగించుకోవాలని నిర్ణయం ఆదివారం నాడు కూడా
ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రశాంత్ కిశోర్ మధ్య సుదీర్ఘ మంతనాలు
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమిని
ఏర్పాటు చేయలా.. కొత్త పార్టీ పెట్టలా అనే విషయంపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పికె)కు చెందిన ఐప్యాక్ సంస్థ సేవలు కొనసాగించాలని అధికార టిఆర్‌ఎస్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలపై తెలుసుకునేందుకు ఐప్యాక్ సంస్థ సేవలను వినియోగించుకోనుంది. ప్రజాభిప్రాయాన్ని, కొత్తగా నమోదవుతున్న ఓటర్ల నాడిని పసిగట్టడంతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ పోషించిన పాత్ర తదితర అంశాల ప్రచారంలో ఐప్యాక్ సేవలను పూర్తి స్థాయి లో అధికార పార్టీ సద్వినియోగం చేసుకోనుంది. ఈ మేరకు రెండో రోజు కూడా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, పికెల మధ్య సుదీర్ఘ మంతనాలు జరిగాయి. కాంగ్రెస్ అధిష్ఠానంతో ఇటీవల వరుస సమావేశాలు జరుపుతున్న పికె శనివారం హైదరాబాద్‌కు వచ్చి రెండు రోజుల పాటు సిఎం కెసిఆర్‌తో చర్చలు జరపడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం రాత్రి ప్రగతిభవన్‌లోనే బస చేసిన పికె ఆదివారం మరో విడతగా సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు.

ప్రధానంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడమా? లేదా? కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా? అన్న అంశాలపై సమాలోచనలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పరిస్థితి….ప్రభుత్వ పనితీరు…అధికార పార్టీ శాసనసభ్యులపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలపై రూపొందించిన ఒక సమగ్ర నివేదికను సిఎం కెసిఆర్‌కు పికె అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా టిఆర్‌ఎస్ పరిస్థితిని సిఎంకు వివరించారని సమాచారం. వివిధ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో నెలకొన్న మనోగతంపై కూడా కెసిఆర్‌తో ఆయన తన అభిప్రాయాన్ని పంచుకునట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక విపక్ష పార్టీలకు చెందిన బలాబలాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో పట్టున్న నేతలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వేలను గురిం చి సిఎంకు పికె విశ్లేషించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం, కెసిఆర్ పాత్ర పట్ల కొత్త ఓటర్లను ప్రభావితం చేసేలా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే అంశం కూడా ఈ సందర్భంగా వారు చర్చించినట్టు సమాచారం. కాగా పికె జరిపిన చర్చల్లో సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా జాతీయ రాజకీయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

వచ్చే సాధారణ ఎ న్నికల్లో కాంగ్రెస్ ఏంటనే దానిపై పికెతో సమాచారం. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐ ప్యాక్ సంస్థ నిర్వహించిన 30 నియోజకవర్గాల్లోని సర్వే ఫలితాలను సిఎం కెసిఆర్‌కు ఇచ్చారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల సర్వే జరిగింది. ఆ నివేదికను కూడా సిఎం కెసిఆర్‌కు పికె సమర్పించినటుగ్లా తెలుస్తోంది. దీంతో పాటు ఆయన కాంగ్రెస్ నేతలతో జరిపిన సమావేశాల గురించి సైతం చర్చ జరిగినట్లు సమాచారాన్ని కూడా విపులంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ చర్చల అనంతరం సిఎం కెసిఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్‌కు వెళ్లిపోయారు. సోమవారం ఉదయం పికె ఢిల్లీ వెళ్లనున్నారు. త్వరలోనే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News