Saturday, December 21, 2024

మును’గోడు’ విన్నదెవరు?

- Advertisement -
- Advertisement -

TRS government eradicated fluorosis:KTR

ఫ్లోరోసిస్‌ను శాపంగా
పాపం కాంగ్రెస్‌దే మిషన్
భగీరథకు నిధులివ్వాలన్న
నీతి ఆయోగ్‌ను ఖాతరు చేయని
కమలం పీడ విరగడ చేసిన
ఘనత టిఆర్‌ఎస్‌దే: కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికపై టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ ఉంటుందని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్లగొండ బిడ్డలకు శాపంగా ఇచ్చిన కాంగ్రెస్ పక్షాన ఉంటారా? ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి అయోగ్ సిఫార్సు చేసినా కూడా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బిజెపి వైపు నిలబడుతారా? ఫ్లోరోసిస్ నుంచి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాప విముక్తి చేసిన టిఆర్‌ఎస్ వైపు ఉంటరా? అని అడిగారు. ఈ మూ డు పార్టీల్లో పోటీ ఎవరి నడుమ పోటీ ఉంటుందని ప్రశ్నించారు. ఫ్లోరైడ్ రక్కసి నల్లగొండ జిల్లాను అతలాకుతలం చేసింది. వేలమందిని జీవచ్ఛవంలా మార్చిం ది. కాళ్లు, చేతులు వంకర పోవడంతో ఏ పనిచేయలేని స్థితి ఉండిపో యి, అనేక బాధలను అనుభవించారు. అలాంటి ఫ్లోరైడ్ రక్కసి నుంచి నల్లగొం డ జిల్లా ప్రజలకు టిఆర్‌ఎస్ సర్కార్ విముక్తి కల్పించింది.

మిషన్ భగీరథ పథ కం ప్రవేశపెట్టి సురక్షితమైన తాగునీరు అందించి ఆ జిల్లా ప్రజల హృదయాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఫ్లోరైడ్ రక్కసికి సంబంధించి గతాన్ని గుర్తు చేస్తూ టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని ముందు మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్షమని పేర్కొన్నారు. దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వ యంగా ప్రధానికి మొర పెట్టుకున్నా పైసా ఇవ్వలేదు, పరిష్కారం కాలేదన్నా రు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంటులో చెప్పిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News