Tuesday, December 24, 2024

శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి  అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని నల్గొండ జిల్లా టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుమారుడు రేగట్టే దినేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

TRS Leader MalliKarjun Reddy’s Son dies in Car Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News