Wednesday, January 22, 2025

లైంగిక వేధింపులు.. ఉప సర్పంచ్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పానుగల్: వనపర్తి జిల్లా పానుగల్ మండలం జమ్మాపూర్ గ్రామానికి చెందిన వితంతు మహిళపై అధికార పార్టీకి చెందిన ఉప సర్పంచు నాగరాజు తన కోరిక తీర్చాలంటూ తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతో విసిగిపోయిన బాధిత మహిళ స్థానిక పోలీసులను ఆశ్రయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, స్థానిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధిత మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు గత 8 సంవత్సరాల క్రితం భర్త రోడ్డు ప్రమాదానికి గురూ మృతి చెందడంతో స్థానికంగా ఆశా కార్యకర్తగా పని చేస్తు ఇద్దరు పిల్లలు అత్తమామలతో కలిసి జీవనం కొనసాగిస్తుంది.

బాధిత మహిలకు ఉన్న సమస్యలను ఆసరాగా చేసుకున్న ఉప సర్పంచు నాగరాజు బాధిత మహిలకు వరుసకు మామ. కాగా నాగరాజు తనతో ఒక రాత్రి గడిపితే నీ ఇంటి పక్కన ఉన్న 32 గుంటల ఖాళీ స్థలం నీకే దక్కేలా చూస్తానని చరవాణిలో తరుచు వేధిస్తున్నాడు. తనతో గడిపితేనే నీకు దక్కుతుందని అలాగే నీ సమస్యలను పరిష్కరిస్తానని లేదంటే పెన్షన్ రాకుండా చేస్తానని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వేధింపులకు గురి చేస్తుండడంతో విసిగి పోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నాగన్న తెలిపారు.

TRS Leader sexual harassment on woman in wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News