Monday, December 23, 2024

రాసపల్లిలో గడపగడపకు టిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మండలంలోని రాసపల్లి గ్రామంలో మంగళవారం టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడిపెల్లి ట్రస్టు చైర్మన్, టీఆర్‌ఎస్ నాయకుడు విజిత్‌రావు గడపగడపకు టిఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తించి మళ్ళీ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు బెడద సురేష్, మాజీ ఎంపీపీ మల్లేష్, నాయకులు పెట్టం తిరుపతి, రాజమల్లు, స్వామి, బండి సత్తయ్య, సత్యాగౌడ్, మొండయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News