Friday, November 22, 2024

హుజూరాబాద్ ప్రచారానికి గ్రేటర్ గులాబీ శ్రేణులు

- Advertisement -
- Advertisement -
TRS Leaders Election Campaign In Huzurabad
టిఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రచారం
25 డివిజన్ల నుంచి తరలి వెళ్లుతున్న కార్యకర్తలు
ప్రభుత్వం పథకాలు వివరిచేందుకు కరపత్రాలు సిద్దం
ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధుల డిపాజిట్ గల్లంతు

హైదరాబాద్: మహానగర గులాబీ పార్టీ శ్రేణులు, నాయకులు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నారు. ఈనెల 1వ తేదీ టిఆర్‌ఎస్ పార్టీ తరుపును గెల్లు శ్రీనివాస్‌యాదవ్ నామినేషన్ వేయడంతో ఆయన గెలుపు కోసం ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లి ప్రచారం చేస్తుండగా, గ్రేటర్ నగరం నుంచి వెళ్లేందుకు ముందుగా 25 డివిజన్లకు చెందిన కార్యకర్తలు వెళ్లుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు ఈనెల 28వ తేదీ వరకు ఉండటంతో అన్ని డివిజన్ల నుంచి ప్రచారం చేసేందుకు దశల వారీగా ప్రచారానికి సిద్దమైతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే పలు డివిజన్లకు చెందిన కమిటీలు ఏర్పాట్లు కావడంతో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులంతా అనుచరులను తీసుకెళ్లేందుకు ప్రచారానికి ఉవ్విళ్లూతున్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కరపత్రాల సిద్దం చేసి ఓటర్లకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, బిజెపి నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలో ఉండటంతో వారంతా ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తూ డిపాజిట్ కోసం కొత్త కొత్త విద్య ప్రదర్శిస్తూ ప్రజలు మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వారికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని సూచిస్తున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా, రైతు బంధు లబ్దిదారుల ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామంటున్నారు. గులాబీ పార్టీ తరుపున తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్ధినేత, బలహీనవర్గాలకు చెందిన యువకుడుకి సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి వర్గాల అభ్యన్నతి కోసం పాటు పడుతున్నారని చెబుతున్నారు.

ఇప్పటివరకు ఏపార్టీ అధినేతలు ఇలాంటి తరహాలో అభ్యర్దులను ఎంపిక చేయలేదని, భవిష్యత్తులో యువతకు టిఆర్‌ఎస్‌లో సముచితం లభిస్తుందని ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో తరహాల్లో ఇక్కడ కూడా రాజకీయ సీనియర్లకు ఆశాభంగం తప్పదంటున్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలే గులాబీ పార్టీకి శ్రీరామ రక్షలాంటివని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఓయూ విద్యార్థినేతలు ప్రచారం చేస్తూ సీఎం కెసిఆర్ పాలనలో ఇప్పటివరకు నిరుద్యోగుల కోసం వేసిన నోటిఫికేషన్లు వివరిస్తూ బిసి, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్ధులకు కార్పొరేట్ తరహాలో విద్యనందిస్తున్నాడని వివరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో రైతుబంధు, దళిత బందు దేశంలో పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తే భవిష్యత్తులో కొత్త పథకాలు తీసుకొచ్చేందుకు సీఎం కెసిఆర్ రూపకల్పన చేస్తున్నట్లు చెబుతున్నారు. మద్యం, డబ్బులు, గిప్టులు ఇస్తామని మభ్యపెట్టే విపక్ష పార్టీల అభ్యర్దులను మట్టికరిపించాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News