Monday, December 23, 2024

సెస్ బరిలో గు‘లాబీ’లు

- Advertisement -
- Advertisement -

తంగళ్లపల్లి : సెస్ డైరెక్టర్‌గా పోటీ చేసేందుకు మండలంలోని టిఆర్‌ఎస్ నాయకుల నుండే రోజు రోజుకు పోటీ తీవ్ర మవుతున్నట్లు కనిపిస్తోంది.నూతన మండలంగా ఏర్పడ్డ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మండలానికి కూడా డైరెక్టర్ స్థానం కల్పించాలంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.దీంతో ఆశావహుల్లో సంతోషం నెలకొంది.సామాజిక మాద్యమాల్లో తనను గెలిపించాలంటూ పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పటికే తనకు మద్దతు ఇవ్వాలంటూ పోటీలో నిలిచే అభ్యర్థులు ద్వితీయ శ్రేణి నాయకులను కలుస్తు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.నామినేషన్లకు ముందు నుండే సెస్ ఎన్నికల సందడి పల్లెల్లో కనిపిస్తోంది.మండలంలో మొత్తం 30 గ్రామాలు ఉన్నప్పటికి దీంట్లో అంకుసాపూర్, చీర్లవంచ, గోపాల్‌రావుపల్లె, లక్ష్మిపూర్,పాపయ్యపల్లె,రామన్నపల్లె,తాడూర్ గ్రామాలు టౌన్ 2 పరిధిలోకి వెళ్లాయి.

దీంతో ఓటర్ల సంఖ్య ఘననీయంగా తగ్గడంతో పోటీలో నిలిచేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు.మొత్తం 1220 ఓట్లు ఉండగా ప్రతి గ్రామ గ్రామాన పాత మిత్రులను పలకరిస్తు నేతలు తమ ప్రచారం కొనసాగిస్తున్నారు.దీంట్లో ప్రధానంగా మాజీ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చీటి నర్సింగరావు,సామాజిక సేవా కార్యకర్త దుబ్బాక రమేష్ తన తండ్రిని పోటీలో నిలుపుతానంటూ ప్రచారాలు వినవస్తున్నాయి.అలాగే ఇందిరమ్మకాలనీ నుండి బైరి రమేష్,నేరేళ్ల నుండి చందర్‌రావులు సోషల్ మీడియాలో విసృత ప్రచారాలు చేస్తున్నారు.ఐతే వీరంతా టిఆర్‌ఎస్ కు చెందిన నేతలు కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే కాంగ్రెస్,బిజెపిల నుండి ఇంకా నాయకులు ముందుకు రావడం లేదు.వారి ప్రచారం కూడా ఎక్కడా కనిపించట్లేదు.మరికొంత మంది నివురు గప్పిన నిప్పులా ఉంటూ తాము సైతం డైరెక్టర్ బరిలో ఉంటామంటూ సన్నిహితుల వద్ద ప్రచారాలు చేస్తున్నారు.ఈనెల 13 నుండి 15 వరకు జరిగే ఎన్నికల నామినేషన్‌లో ఎవరు బరిలోఉంటారో తేలిపోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News