- Advertisement -
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లలో టిఆర్ఎస్ కు 503, బిజెపికి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు దక్కాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తికావడంతో ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఒక్కో కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ విధించారు.
TRS Leads in postal ballot vote counting in Huzurabad
- Advertisement -