Monday, December 23, 2024

వరి వార్‌పై నేడు టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

- Advertisement -
- Advertisement -

TRS LP meeting today

తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్
అధ్యక్షతన సమావేశం హాజరు
కానున్న వివిధ స్థాయిల
పార్టీ ప్రముఖులు

మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు జరిగే టిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎ లాంటి నిర్ణయాలు తీసుకోనున్నారన్న అంశంపై రా ష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రధానంగా వరి ధా న్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంపై తాడే… పేడే తేల్చు కోవాలని సిఎం కెసిఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆందోళన కార్యక్రమాల ను చేపట్టబోతున్నారు? తదితర అంశాలపై ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి. కొనుగోలు అంశంపై మరోమారు కేంద్రంపై దండెత్తేందుకు అవసరమైన కార్యచరణ ప్రణాళికను రూపొందించడం కోసం సిఎం కెసిఆర్ సోమవారం ప్రత్యేకంగా టిఆర్ ఎస్ ఎల్‌పి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ భవన్‌లో సిఎం అధ్య క్షతన జరిగే ఈ సమావేశంలో వరిధాన్యంపై కేంద్రం పై పోరు మరింత ఉధృతం చేసే విధంగా వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెం ట్ సమావేశాల్లో ఒకవైపు టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళన లను ఉధృతం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ని రసన కార్యక్రమాలకు పిలుపునిచ్చే విధంగా నేటి స మావేశంలో సిఎం కెసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసు కునే అవకాశముందని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ అంశంపై రాష్ట్రం తన వాణిని వినిపించిన కెసిఆర్… ఇక ఢిల్లీ వేదికగా కేంద్రంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మోడీ ప్రభుత్వంపై కొద్ది రోజులుగా సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడుతున్నారు. దీనిని మరింత ఉధృతం చేయాలన్న లక్షంతోనే ఆయన వరిపై ఇక ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే పార్టీ శాసనసభ పక్ష సమావేశానికి మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్‌పి చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ల అధ్యక్షులతో పాటు రైతు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ సమావేశం తర్వాత సిఎంతో పాటు మంత్రుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News