Friday, November 22, 2024

దిక్కులు పిక్కటిల్లేలా విజయగర్జన

- Advertisement -
- Advertisement -
TRS Making Arrangements To Celebrate 20 Years Festival
20 సంవత్సరాల సగర్వ ఘనచరిత్రకు అద్దంపట్టేలా ఓరుగల్లు సభకు ఏర్పాట్లు ప్రారంభం
వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టు ప్రాంతం, ఇతర చోట్ల సభకు
స్థలాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాష్ట్రం
నలుమూలల నుంచి భారీ స్థాయిలో సభకు విచ్చేయనున్న ప్రజలు, పార్టీ
శ్రేణులు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు
చేయాలని సిఎం ఆదేశం ఆ మేరకు ఇప్పటినుంచే మొదలైన సభాస్థలి
ఎంపిక మున్నగు కార్యక్రమాలు

మన తెలంగాణ/హైదరాబాద్ / వరంగల్ : విజయ గర్జన సభకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో అధికార పార్టీ విజయ గర్జన పేరిట భారీ బహిరంగ సభను తలపెట్టింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ తలపెట్టని విధంగా, భవిష్యత్తులో ఎవరికి సాధ్యపడని రీతిలో లక్షలాది జన సము హంతో సభను నిర్వహించాలని టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సభ కోసం భారీ ఏర్పాట్లకు ప్లాన్ చేసింది. టిఆర్‌ఎస్‌ని ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా ఈ విజయ గర్జన సభ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ సభను వరంగల్ నిర్వహించాలని తలపెట్టారు. ఈ సభకు టిఆర్‌ఎస్‌లో రాష్ట్ర స్థాయి నాయకుడి నుంచి మొదలుకుని పోలింగ్ బూత్ స్థాయి వరకు నాయకులు హాజరుకానున్నారు.

అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలను తరలించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ గర్జన సభపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గర్జన సభను తమ జిల్లాలో నిర్వహించాలని సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ….. సభ కోసం తరలివచ్చే ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా తీసుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. అలాగే లక్షలాదిగా తరలిరానున్న అశేష జనానికి కూడా ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విషయంలో నిమగ్నమయ్యారు. ఈ విజయ గర్జన సభ ప్రాంగణం… వాహన పార్కింగ్ సౌకర్యం, నీటి సౌకర్యతో పాటు కరోనా నిబంధనలను పాటించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి సిఎం కెసిఆర్ ప్రసంగం స్పష్టంగా వినపడే సౌండ్ సిస్టం ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇందులో భాగంగా శనివారం శాసనసభ్యులు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి స్థల పరిశీలన చేశారు. వరంగల్ మామునూరులోని స్థలాన్ని మంత్రి పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ స్థలం, హాజరయ్యే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు సరిపోయే విధంగా ఉంటుందా? అనే విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇది కాకుండా ఇతరత్రా ఇంకా ఏమైనా స్థలాలు ఉన్నాయా? అనే విషయాన్ని కూడా మంత్రి పరిశీలించారు. అన్ని హంగులతో సభ విజయవంతం కావడానికి అవసరమైన స్థలం అవసరమని, అందుకు అన్ని విధాలుగా అనువైన స్థలం కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పార్టీ శాసనసభ్యులకు సూచించారు. మరో రెండు, మూడు స్థలాలను కూడా ఎంపిక చేసిన అనంతరం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌తో చర్చించిన మీదట సభాస్థలిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News