Thursday, January 23, 2025

బండి ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలి: టిఆర్ఎస్ ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

TRS MLA comments on Bandi Sanjay

 

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పాదయాత్రలో ఇది చేస్తానని ఒక్క విషయమైనా చెప్పినవా అని ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. నలుగురు ఎంపిలను గెలిపిస్తే ఏం పీకుతున్నారని ప్రశ్నించారు. ఒక ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకొచ్చారా ? అని అడిగారు. దేవరకద్రా నియోజకవర్గంలో ఒక్క ఎకరం భూమి ఖాళీగా ఉందా?, ఎన్ని చెక్ డ్యామ్‌లు కట్టామో చూశావా? అని బండి సంజయ్‌కు చురకలంటించారు. చెక్ డ్యామ్‌లు కడితే కేంద్రం ఎన్ని అవార్డులు ఇచ్చిందో తెలుసా? అని అడిగారు. తెలంగాణ ఉద్యమ కారుల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు. ఉద్యమ కారులపై కేసులు పెట్టింది డికె అరుణ కాదా? అని మండిపడ్డారు. డికె అరుణే కదా హంద్రీనీవాకు హారుతులు పట్టిందన్నారు. ఏనిమిదేళ్లలో దేశ ప్రజలకు ఒక్క మంచి పనైనా చేశారా? అని అడిగారు. ఎంపి బండి సంజయ్‌కు సిగ్గు, శరం ఉంటే ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలని ఆల వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకరావాలని సవాలు విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News