Saturday, November 23, 2024

దానం నాగేందర్‌కు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

TRS MLA Danam Nagender gets relief in high court

హైదరాబాద్: ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌కు హైకోర్టులో బుధవారం నాడు ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇటీవల ఓ దాడి కేసులో దానంకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. ఎంపి, ఎంఎల్‌ఎల కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ఈ కేసుపై విచారణ ఆగస్టు 23కి హైకోర్టు వాయిదా వేసింది. ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు దానం నాగేందర్‌కు రూ. వెయ్యి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించింది. బంజారాహిల్స్‌లో 2013లో నమోదైన కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు దానంపై నేరం రుజువుకావడంతో దోషిగా తేల్చింది. అంతేకాదు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. శిక్ష అమలును నెల రోజుల పాటు న్యాయస్థానం వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News