Tuesday, January 21, 2025

బిజెపి జాతీయ నేతల బండారం బయటపడింది: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిజెపి జాతీయ నేతల బండారం బయటపడిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో ఎక్కడా మనీలాండరింగ్ జరగలేదు. మొదటి రోజు ఆరు గంటలు విచారించినా, ఏ కేసు గురించి ప్రశ్నిస్తున్నారో చెప్పలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించి రెండో రోజు ప్రశ్నించారు. కేవలం నన్ను లొంగదీసుకోవాలనే ఈడీ విచారణ జరిపింది.

ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. కంప్టైట్ చేసిన నన్ను విచారించారు తప్ప.. నిందితులను ఎందుకు ప్రశ్నించలేదు. కేంద్ర చేతిలో ఉన్న ఈడీతో నాకు నోటీసులు పంపి, విచారణ జరిపించారు. ఇప్పుడు ఈడీ రూట్ మార్చి నందకుమార్ ను విచారించాలని చూస్తోంది. నందకుమార్ ద్వారా ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఈ కొత్త కుట్రలను మేము భగ్నం చేస్తాం. రేపు హైకోర్టులో రిట్ దాఖలు చేయబోతున్నాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News