- Advertisement -
నిజామాబాద్: పాస్‌పోర్టుల జారీ ఎవరి పరిధిలోకి వస్తుందో తెలుసుకుని ఎంపి అరవింద్ మాట్లాడాలని ఎంఎల్‌ఎ షకీల్ సూచించారు. భోదన్‌లోని ఇతర రాష్ట్రాల ఆధార్ కార్డులతో బంగ్లాదేశీయులు ఒకే ఇంటి నుంచి 32 పాస్‌పోర్టులు పొందితే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో దేశ రక్షణ భంగం కలుగుతోందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే బిజెపి నేతలు అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. ఉమ్మడి ఎపి మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపి డి. శ్రీనివాస్‌కి రాజకీయ భిక్ష పెట్టింది ముస్లింలే అన్నది గుర్తించుకోవాలన్నారు. ఎంపి అరవింద్ మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని షకీల్ సవాలు విసిరారు. సిఎం కెసిఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలు బిజెపికి తగిన బుద్ధి చెబుతారన్నారు.
- Advertisement -