హైదరాబాద్: రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎంఎల్ఎలు శనివారం ఫైర్ అయ్యారు. రాజస్థాన్ లో బిఎస్పీ ఎంఎల్ఎలను కాంగ్రెస్ చేర్చుకున్నారని, వాళ్లను కూడా రాళ్లతో కొట్టమంటారా..? అని టిఆర్ఎస్ ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. మీరు రాళ్లతో కొడితే టిఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులతో కొడతారని సుధీర్ రెడ్డి తేల్చిచెప్పారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన మీరు మా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఠాగుర్ కు రూ.20 కోట్లు ఇచ్చి టిపిసిసి పదవి తెచ్చకున్నావని సుధీర్ రెడ్డి విమర్శించారు. టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలో విలీనం చేయలేదా..? అని సుధీర్ రెడ్డి అన్నారు. మాటల గారడి చేస్తే జోకర్ లా మిగిలిపోతావని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చిరాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదలే వివాదాస్పదమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని సుధీర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రజల అభీష్టానికి దూరంగా వెళ్తోంది. పార్టీలో ఏళ్ల తరబడి ఉన్నవాల్లకు న్యాయం జరగటం లేదన్నారు. పిసిసి అధ్యక్ష పదవి రాకుంటే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కాదని ఆయన వివరించారు.