Wednesday, January 22, 2025

ఆ నలుగురూ… మనం!

- Advertisement -
- Advertisement -

ఆ ‘నలుగురు’ అనిఅంతర్జాలంలోవెతికితే రాజేంద్రప్రసాద్ సినిమా కంటే-ఆర్.ఎస్.ఎస్. నోట్ల కట్టలతో పంపిన బ్రోకర్లను పట్టించిన నిక్సాన నలుగురు తెలంగాణ ఎమ్మేల్యేలనుచూపిస్తున్నది గూగుల్. ఆ సినిమా దర్శకుడు చంద్రసిద్దార్థ అయితే ఇక్కడ దార్శనికుడు చంద్రశేఖర రావు!
‘ ఆ నలుగురు’సినిమా కుటుంబసంబంధాలు, మానవీయ విలువల గురించి తెలియజేస్తే ఈ నలుగురు ప్రజాస్వామ్య విలువను పదిలం చేసిన్రు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పైలట్ రోహిత్ రెడ్డి. ఆయన సహా మొన్న బీజేపీకిదిమ్మ తిరిగే దెబ్బకొట్టిన వారిలో హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు. ‘వీరిలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిటీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించి ఇపుడు నీతులు చెపుతున్నరు’అంటూబీజేపీ నాయకులు సొల్లు విమర్శలు చేస్తున్నరు. వారికి సూటి సమాధానం. ఫిరాయింపుల విషయంలో నీతులు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎనిమిదేండ్లలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీవారుఅందరిలోకీ భ్రష్టులు, దరిద్రులు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ‘చేరికల కమిటీ’ పెట్టి తెలంగాణలో ఏక్నాథ్ షిండేలను తయారు చేస్తంఅని నిర్లజ్జగా ప్రకటించుకున్న పార్టీ బీజేపీ.
ఇపుడు చిలకపలుకులు పలుకుతున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓటుకు నోటు కేసులో పట్టుబడిన దొంగ. ఆయన మాటకు తెలంగాణలో బుడ్డిపైసా విలువ లేదు. రేవంత్‌ను నడిపిస్తున్న తెలంగాణ వ్యతిరేక శక్తులు, వారి అభిమానులు యెంత నోరు మూసుకుంటే అంత మంచిది, వారికే!
బీజేపీలాగ, కాంగ్రెస్‌లాగ, టీడీపీలాగ ఎన్నికయిన ప్రభుత్వాలను పడగొట్టడం, పడగొట్టే కుట్రలు చేయడం కేసీఆర్ ఎప్పుడూ చేయరు. తన ప్రభుత్వంపై నాడు జరిగిన కుట్రను, నేటి కుట్రనునభూతోనభవిష్యత్ రీతిలో తిప్పికొట్టిన్రు కేసీఆర్. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి ఎవరైనా అడ్డుతగిలితే పైకి లేవకుండాతొక్కుతరు. రాసి పెట్టుకోండి. నేటి టీఆర్‌ఎస్‌కానీ, రేపటి బీఆర్‌ఎస్‌కానీ తన ప్రభుత్వాలను ఎవడైనాకాటేయజూస్తేమూడోనేత్రం తెరచి భస్మం చేయడమే. క్షమించడం ఉండదు. ఇది కేసీఆర్ అనే వ్యక్తి యొక్క మూర్తిమత్వలక్షణాంశం (personality trait) మాత్రమే కాదు, తిరుగులేని ఆయన రాజనీతి కూడా!
ఫిరాయింపులు స్థూలంగా తప్పేమీ కావు అని సామాన్య ప్రజలు కూడా అనుకుంటరు కాబట్టి వాటికి పెద్ద విలువ ఏమీ లేదు. అయితే, ఎందుకు ఫిరాయిస్తున్నరు అనేది ముఖ్యం. ఏమి సాధించడానికి, ఎవరిని బలోపేతం చేయడానికి అనేది ముఖ్యం. ఈ దేశ ప్రజలను దివాళా తీయించిన బీజేపీ పక్షంలోకి ఎవరు పోయినా అది దేశం పట్ల చేసే ద్రోహమే. మరోమాట లేదు.
ఉత్తుత్తి విలువల కంటే; డొల్ల మాటలకంటే; వ్యవస్థలను భ్రష్టు పట్టించి, దేశాన్ని అథోగతిపాలుచేస్తున్నబీజేపీకి పక్కలో బల్లెంలా మారడం కంటే దేశభక్తి మరొకటి లేదు. అందుకోసం యేమార్గం తొక్కినా తప్పులేదు.చేసిందంతా చేసి చివరి అధ్యాయంలో రథం ఎత్తుతున్నవారిని చంపొద్దు, తొడల కింద కొట్టొద్దు, చెట్టు చాటు నుంచి బాణం వేయొద్దుఅని మాట్లాడితే ఎవరూ లెక్కచేయరు, హర్షించరు! పాపకూపపుబీజేపీని, ఈ దేశానికి ప్రమాదం అయిన బీజేపీని పాతిపెట్టడానికి పనికొచ్చే యే ఆయుధమైనా అత్యుత్తమమైనదే.
కాబట్టే మనం ‘కుదిరితే కొనుక్కోవడం, కుదరకపోతే కుమ్మక్కుకావడం’ అనే కూటనీతిని అడ్డుకోవాల్సి ఉన్నది. పోనీ ఇంతింత సొమ్ములు కుమ్మరిస్తున్నారు కదా, అభివృద్ధి విషయంలోనూ అలాంటి దూకుడే ఉందా అంటే లేనేలేదు. అంతా దిగదుడుపు. ఎనిమిదేళ్లలో తెచ్చిన భారీ ఇన్వెస్ట్మెంట్ గానీ, ప్రొడక్షన్ సెక్టర్ లో పెట్టిన కనీస పెట్టుబడిగానీ, నెలకొల్పిన వ్యవస్థగానీఏదైనాఉందేమో చెప్పమనండి. ఏదీ లేదు. శూన్యం. చైనాను ఎదుర్కోవడం అంటే టిక్ టాక్ ని బేన్ చేయడం, రాజకీయంగా బలపడటం అంటే ఎమ్మెల్యేలను కొనుక్కోవడం – అన్నట్టే ఉంది బీజేపీ పనితనం.
తొమ్మిది రాష్ట్రాలలో పారిన బీజేపీ పాచిక తెలంగాణలో పారలేదు అంటే అందుకు కారణం ఒకే ఒక్క కేసీఆర్. ఆయన రాజకీయ, తాత్విక చింతన; ఆయన వ్యూహాలు అర్థం చేసుకున్న తెలంగాణ బిడ్డలుగా ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమ కర్తవ్యాన్ని మొక్కవోని దీక్షతో నిర్వహించిన్రు. వారికి యావత్ తెలంగాణ జేజేలుపలుకుతున్నది.
ఎందుకంటే, బీజేపీ బారి నుంచి ఆ ఎమ్మెల్యేలు రక్షించింది ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని మాత్రమే కాదు. తెలంగాణవాదాన్నిరక్షించిన్రు! తెలంగాణ మోడల్ ను రేపు దేశవ్యాపితం చేయబోయే భారత్ రాష్ట్ర సమితి ఫిలాసఫీని రక్షించిన్రు. అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం అనే గుండెలోతుల్లో పెట్టుకున్న లక్ష్యాలను, వాటి సాకారతను పదిలం చేసిన్రు. కాబట్టే ఈ సంబురం.
ఆ నలుగురు సరే… మరి మనమేం చేద్దాం?!
‘సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటేపొరపాటోయీ…’ అంటరు కదా శ్రీశ్రీ. ఇపుడు మన ముందు కూడా చేయాల్సిన పని వున్నది. ఆ నలుగురికి దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ను మరింతగా అర్థం చేసుకోవలసి ఉన్నది. లోతుగా ప్రేమించవలసి ఉన్నది. ఆయన ప్రకటిత లక్ష్యాల సాధనకు అంకితం కావాల్సి ఉన్నది. అదిగో… ఆ అడుగు ఇపుడు పడాలి. తెల్లవారితే పోలింగ్ జరగనున్న మునుగోడులోటీఆర్‌ఎస్ అద్భుత విజయం సొంతం చేసుకుని బీఆర్‌ఎస్ కు ఒలింపిక్ టార్చ్ అందించాల్సి ఉన్నది.
ఏడున్నర దశాబ్దాల స్వపరిపాలనలో నల్లగొండ జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ ఒక్కడే కారకుడు – ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసినా,నేతన్నలకు అభివృద్ధి/సంక్షేమాలకు నిధులు పెంచినా, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, ఆసరా పెన్షన్లు ఇచ్చినా అది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. బీజేపీవారు మీ చెవులలో పెట్టడమే కాకుండా పువ్వుగుర్తులు చేయిపై కూడా వేస్తున్నారు – కేసీఆర్ మీ మోముపై చిరునవ్వులు పూయిస్తున్నారు. మీరు గుండెనిండుగా తెలంగాణ బిడ్డను ఆశీర్వదించాలె. మీరిచ్చిన దన్నుతో భారతదేశమంతా మన పాలన సాకారం కావాలె. మునుగోడుతో పాటు, తెలంగాణతో పాటు దేశప్రజలందరికీ పొలాల్లో నీళ్ళు పారాలె, కండ్లల్లో కాదు. నూకలు తినమని ఎకసెక్కాలు ఆడినవాళ్లకు నూకలు చెల్లు చేయాలి ఈ గడ్డ నుంచే. ఈ యజ్ఞంలో మనందరం గొప్ప కష్టాలు, నష్టాలు పడాల్సిన పనిలేదు. వల్లకాని త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. బతుకును బాగుచేసుకునేందుకు ఓటు ఆయుధానికి పని చెప్పాలి. కత్తిని మన నాయకుని చేతికి ఇచ్చి మనకోసం కదనరంగానికి పంపాలి. ఎందుకంటే మన నాయకుని రాజకీయాలు వ్యాపారం కాదు, గేమూ కాదు. అదొక టాస్క్! వీరగంధంవీరునికి పూయాల్సిన సందర్భం, నవంబర్ 3! కదులుదాం, పదండి… బీజేపీని బంగాళాఖాతంలో విసిరేయడానికి. జై తెలంగాణ! జై భారత్!!

శ్రీశైల్ రెడ్డి పంజుగుల
9030997371

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News