Monday, November 18, 2024

టిఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతుగా మంత్రుల విస్తృత ప్రచారం

- Advertisement -
- Advertisement -

TRS MLC candidate Vani Devi election campaign

హైదరాబాద్: గత 6 ఏళ్లుగా ఎమ్మెల్సీ ఉన్న బిజెపి అభ్యర్థి ఎన్. రామచంద్రర్ రావు తనకు ఓటేసి గెలిపించిన పట్టభద్రులకు ఏమి చేశారో చెప్పాలని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలను ఇస్తే, కోటి ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలకు ఊడగోడుతూ ప్రజలను రోడ్ల పాలు చేస్తోందని ఆయన విమర్శించారు. మహబూబ్‌నగర్-‌రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న టిఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవితో కలిసి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌లు ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సనత్ నగర్ డివిజన్‌లోని శ్యామలకుంట పార్క్‌లో పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు.

అనంరతం బికెగూడలో గల సీనియర్ సిటీజన్స్ కార్యాలయంలో సీనియర్ సిటీజన్స్‌లో కలిసి అల్పాహారం చేశారు. బేగంపేటలోని ఎయిర్ లైన్స్ కాలనీలో కాలనీ వాసులతో సమావేశమైన మంత్రులు, ఆ తర్వాత అమీర్‌పేట్‌లోని కెకె బాంకేట్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇప్పటీకే 1.32లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం మరో 50వేల ఉద్యోగాల భర్తీకి సిఎం కెసిఆర్ ఆదేశాలు ఇచ్చారని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎందో విలువైందని, ఈ నెల 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా పోలింగ్‌లో పాల్గొన్నివిద్యావంతురాలు, విద్యారంగంపై ఆపార అనుభవం కలిగిన వాణిదేవికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తలసాని కోరారు.

టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంపై తనకు 35 ఏళ్ల ఆపార అనుభవం ఉందని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె పట్టభద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి వాణిదేవిని ఎమ్మెల్సీగా గెలిపించి రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ఓటర్లను కోరారు. మచ్చలేని మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు కూతురు సురభి వాణిదేవిని ఎమ్మెల్సీగా గెలుపించుకోవడమే మనం పివికి నిజమైన నివాళ్లు అర్పించినవారమవుతామన్నారు. ప్రచార కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జీ తలసాని సాయి కిరణ్ యాదవ్, సాప్స్ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News