Saturday, December 21, 2024

సిబిఐకి ఎంఎల్‌సి కవిత లేఖ…స్పష్టీకరణ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో దర్యాప్తునకు సంబంధించి మంగళవారం విచారణకు హాజరు కాలేనని సిబిఐకి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంఎల్‌సి కవిత తెలిపారు. ఆమె ఈ మేరకు సిబిఐ అధికారులకి లేఖ రాశారు. ఇదివరకే ఖరారైన కార్యక్రమాల దృష్టా హాజరుకాలేనని తన లేఖలో ఆమె పేర్కొన్నారు. అంతేకాక డిసెంబర్ 11,12,14,15 తేదీలలో అందుబాటులో ఉంటానని కూడా తెలిపారు.

మద్యం కేసులో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ కాపీలు ఇవ్వాలని ఇటీవల సిబిఐని కవిత కోరిన సంగతి తెలిసిందే. దానికి సిబిఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని ఆమెకు ఈమెయిల్ ద్వారా తెలిపారు. దానిపై స్పందించిన కవిత “ సిబిఐ వెబ్‌సైట్లో ఎఫ్‌ఐఆర్ కాపీని క్షుణ్ణంగా పరిశీలించాను, అందులో నా పేరు లేదు. అయినా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ముందుగా ఖరారైన కార్యక్రమాల దృష్టా మంగళవారం(డిసెంబర్ 6వ తేదీ) విచారణకు హాజరుకాలేను. ఈ నెల 11,12,14,15 తేదీలలో అందుబాటులో ఉంటాను” అని తన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News