Wednesday, January 22, 2025

అజ్మీర్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

TRS MLC Kavitha visits Ajmer Dargah

అజ్మీర్‌: రాజస్థాన్ లోని అజ్మీర్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాకు చాదర్ ను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు కవిత తెలిపారు. అనంతరం దర్గా పెద్దలను కల్వకుంట్ల కవిత కలుసుకున్నారు. మైనార్టీల సంక్షేమానికి సిఎం కెసిఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. కెసిఆర్ నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. అదేవిధంగా, రాజస్థాన్ లోని పుష్కర్ దేవాలయాన్ని, శ్రీనాథ్ జీ దేవాలయాన్ని కూడా కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆజం అలీ, బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్, టిఆర్ఎస్ నాయకులు కుద్దూస్, నవీద్ ఇక్బాల్, అలీం తదితరులు అజ్మీర్ దర్గాను సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News