ఢిల్లీ: మంచిర్యాలలో ఈ ఏడాదే మెడికల్ బోధనా కళాశాల తరగతులను ప్రారంభించాలని పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజ్ భూషణ్ ను కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి మెడికల్ కళాశాల తరగతుల ప్రారంభించడంతో పాటు పలు విషయాలను చర్చించారు. ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమైతే పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ఆయనకు వివరించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి సైతం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే తరగతులు ప్రారంభించాలని విన్నవించారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈనెల 26న కళాశాల బోధన తరగతుల ప్రారంభ విషయమై రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి హరీష్ రావును కలువగా ఆయన సైతం దీని ప్రారంభ విషయమై తనవంతు ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
కేంద్ర మంత్రితో ఎంపి బోర్లకుంట, ఎంఎల్ఎ దివాకర్ రావు భేటీ..
- Advertisement -
- Advertisement -
- Advertisement -