Wednesday, November 6, 2024

పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ

- Advertisement -
- Advertisement -

TRS MPs boycott parliamentary sessions

రాష్ట్రంలోని వరి రైతులకు కేంద్రం దగాపై వారం రోజుల పాటు సాగించిన నిరసన కార్యక్రమం వృథా కావడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టిఆర్‌ఎస్ ఎంపిలు

కేంద్రం తీరుకు నిరసనగా బాయ్‌కాట్ చేస్తున్నాం
మా ఆందోళనను పట్టించుకోకపోవడం వల్లనే సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నాం : కె.కేశవరావు
కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం : నామా

మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ టిఆర్‌ఎస్ పార్టీ ఎంపిలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. ఎంపి కేశవరావు మాట్లాడుతూ.. వారం రోజులుగా పార్లమెంటు వేదికగా ఆందోళన చేస్తున్నామని చెప్పారు. తమ ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ నిర్ణఁం తీసుకున్నట్లుగా తెలిపారు. కేంద్రం తీరుకు నిరసనగా బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రకటించారు. సమావేశాలను బాయ్‌కాట్ చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు. లోక్‌సభలో 9 మంది, రాజ్యసభలో 7 మంది సభ్యులు సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లుగా చెప్పారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సిఐ నిర్లక్షం వహిస్తోందన్నారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతున్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందని, వాతావరణ పరిస్థితుల వల్ల రా రైస్ రాదని తెలిపారు.

రబీ ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచే ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ ఎంపిలు ఉభయ సభల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే మంగళవారం నల్లచొక్కాలు ధరించిన టిఆర్‌ఎస్ ఎంపిలు లోక్‌సభ, రాజ్యసభలలో నిరసన తెలియజేశారు. లోక్‌సభలో స్పీకర్ సోడియం వద్ద టిఆర్‌ఎస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం లోక్‌సభ, రాజ్యసభ నుంచి టిఆర్‌ఎస్ ఎంపిలు వాకౌట్ చేశారు. అనంతరం టిఆర్‌ఎస్.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపి కె.కేశవరావు ప్రకటించారు. డిసెంబర్ 23 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలకు తమ ఎంపీలు హాజరు కాబోరని చెప్పారు. తెలంగాణ నుంచి వరి కోనుగోళ్లు చేపట్టాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు. రైతులను కాపాడాలని పార్లమెంట్ ఆవరణలో టిఆర్‌ఎస్ ఎంపిలు నినాదాలు చేశారు. రైతులకు న్యాయం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

రాజీనామా చేసే అంశాన్ని ఆలోచిస్తాం

కేంద్రం వైఖరిని అర్థం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. రైతుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. తెరాస ప్రభుత్వం నూతన పంథాలో పోరాటం మొదలు పెడుతుందని వెల్లడించారు. ఇక కేంద్రంపై పోరేనని.. రైతుల కోసం రాజీనామా చేసే అంశాన్ని ఆలోచిస్తామన్నారు. పార్లమెంట్ ఉ భయసభల్లో మెజార్టీ ఉంది కాబట్టే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి మార్చుకునే వరకూ పోరాడుతామని స్పష్టీకరించారు. త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం : నామా

పార్లమెంట్ సాక్షిగా రాజకీయాలు చేస్తున్నారని ఎంపి నామానాగేశ్వరరావు అన్నారు. బిజెపి నేతలు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారన్నారు. యాసంగి పంటను కొనుగోలు చేస్తా రో లేదో చెప్పడం లేదన్నారు. తెలంగాణ రైతుల కోసమే వాకౌ ట్ చేస్తున్నామని తెలిపారు. రైతులకు న్యాయం జరగట్లేదనే బా య్‌కాట్ చేస్తున్నామన్నారు. కొంతమంది చిల్లర మాట లు మా ట్లాడుతున్నారన్నారు. అన్ని విధాలుగా తమ నిరసనను తెలియజేశామని తెలిపారు. ఏడు రోజులుగా ఆందోళన చేస్తు న్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. తాము ఒకటి అడిగితే.. కేం ద్రం మరొకటి చెబుతోందన్నారు. కేంద్రం తీరుకు నిరసనగానే ఉభయసభలను బాయ్‌కాట్ చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రైతులను రోడ్లపైకి తెచ్చే ప్రయత్నం కేంద్రం చేస్తోందన్నారు. ఆ తీరును సిఎం కెసిఆర్ ముందుగానే గ్రహించారని తెలిపారు. కేంద్రం తీరును ప్రజా క్షేత్రంలోనే ఎండగడతామని స్పష్టం చేశారు. వరి కొనుగోళ్లక సంబంధించి గత కొంత కా లంగా తెలంగాణలో టిఆర్‌ఎస్.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వా ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి విదితమే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News