Saturday, November 23, 2024

నవో”దయ”లేని కేంద్రం

- Advertisement -
- Advertisement -

33 జిల్లాలున్న రాష్ట్రానికి ఇప్పటివరకు
కేవలం 9 విద్యాలయాలను మాత్రమే
కేంద్రం ఇచ్చింది ఉభయ
వాయిదా తీర్మానం ఇచ్చాం
భారతదేశంలో తెలంగాణ లేదా?
న్యాయం జరిగే వరకు అన్ని అంశాలపై
కేంద్రంతో పోరాటం చేస్తా : ఎంపి
నామా నాగేశ్వరరావు

వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో టిఆర్‌ఎస్ ఎంపిల వాకౌట్

నవోదయ పాఠశాలల కేటాయింపులో తెలంగాణపై వివక్ష

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంపై కేంద్రం చాలా విషయాల్లో వి వక్ష చూపిస్తోందని ఎంపి నామా నా గేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. 33 జిల్లాలున్న రాష్ట్రానికి ఇప్పటివరకు కేవలం 9 నవోదయ విద్యాలయాలను మాత్రమే ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. నవోదయ విద్యాలయాలపై విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని దీనిపై ఉభయసభల్లో శుక్రవారం వా యిదా తీర్మానం ఇచ్చినట్టు నామ తెలిపారు. ఈ వాయిదా తీర్మానాలను ఉభయసభలు తిరస్కరించడంతో ఎంపిలంతా సభల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన ఒక్క పని కూడా సక్రమంగా చేయడం లేదని ఆయన ఆరోపించారు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాలని ప్రధానికి ఎన్ని సార్లు లేఖలు రాసినా లాభం లేకుండా పోతోందన్నారు. తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రాలకు ఎక్కువ నవోదయాలు ఇచ్చి తెలంగాణకు మాత్రం కేవలం 9 విద్యాలయాలే ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లోనూ ఉందన్నారు. నవోదయాలను 33 జిల్లాలకు ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రధాని పెడచెవిన పెడుతున్నారన్నారు.

ఉభయసభల్లో తెలంగాణ గొంతును…

బాగా చదువుతున్న వారిలో తెలంగాణ విద్యార్థులు ముందు వరసలో ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలకు నవోదయాలతో పాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐడిలు, ట్రిపుల్‌టీల్లో ఏ ఒక్కటీ కూడా తెలంగాణకు ఇవ్వడం లేదన్నారు. 150 వైద్య కళాశాలల్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ సమయంలో అనేక సార్లు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తమ గొంతు వినిపించామని అయినా కేంద్రం పెడచెవిన పెడుతోందన్నారు. ధ్యానం కొనుగోలు, ఎస్టీ రిజర్వేషన్లు, నిరుద్యోగం, నవోదయ విద్యాల యాల అంశాలను లేవనెత్తామన్నారు. ఇవాళ నవోదయ విద్యాలయాల అంశంపై రాజ్యసభ, లోక్ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని, తెలంగాణకు అన్యాయ జరుగుతుందని అడిగామని, అయినా రాష్ట్ర సమస్యలపై అవకాశం ఇవ్వడం లేదని వాకౌట్ చేశామని ఆయన తెలిపారు.

మా కంటే చిన్న రాష్ట్రాలకు…

మా కంటే చిన్న రాష్ట్రాలకు అస్సాంలో 27, గుజరాత్‌లో 31, హర్యానాకు 21, హిమాచల్ ప్రదేశ్‌కు 17, మణిపూర్‌లో 11, త్రిపుర లో 7 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని ఎంపి నామా తెలిపారు. భారతదేశంలో తెలంగాణ లేదా..? మా తెలంగాణ బిడ్డలు భారత బిడ్డలు కాదా.? ఎందు కు ఇంత అన్యాయమని ఆయన ప్రశ్నించారు. కేరళ తర్వాత బాగా చదువుకున్న విద్యార్థుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. 5 ఏళ్లలో 80 నవోదయ విద్యాలయాలు ఇచ్చారని, తెలంగాణను మాత్రం జీరో చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఇంత కక్ష, విషం ఎందుకు కక్కుతున్నారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ఎంపిలను అడుగుతున్నాం, తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు, కనీసం నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చే బాధ్యత మీకు లేదా అంటూ ఆయన రాష్ట్ర బిజెపి ఎంపిలను ప్రశ్నించారు. చేతనైతే పెండింగ్‌లో ఉన్న నవోదయ విద్యాలయాలు ఒక నెలలో తీసుకురావాలని ఆయన వారికి సూచించారు. చెప్పండి తీసుకొచ్చామని దండేసి దండం పెడతామన్నారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు అన్ని అంశాలపై కేంద్రంతో పోరాటం చేస్తామని నామా పేర్కొన్నారు.

బిజెపి ఎంపిలు సిగ్గు పడాలి : బడుగుల

బడుగుల లింగయ్య యాదవ్, రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు. ఉన్న హామీలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. కృష్ణ జలాలపై ట్రిబ్యునల్, బయ్యారం ఉక్కు, గిరిజన యూనివర్సిటీతో పాటు ఏ హామీని నెరవేర్చడం లేదన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయనట్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశానికి రోల్ మోడల్ గా సిఎం కెసిఆర్ నిలిపారన్నారు. సిఎం కెసిఆర్ కాళేశ్వరం, రైతుబంధు, కల్యాణలక్ష్మి ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచిన బిజెపి ఎంపిలు సిగ్గు పడాలన్నారు. తెలంగాణ సమస్యలపై టిఆర్‌ఎస్ ఎంపి లు పోరాడుతుంటే బిజెపి ఎంపిలు అవహేళన చేస్తున్నారన్నారు. దేశంలో తెలంగాణ భాగమేనని, పంజాబ్‌లో ఎలా ధాన్యం సేకరణ చేస్తున్నా రో తెలంగాణలో కూడా అలాగే చేయాలన్నారు.

నవోదయ విద్యాలయాలతో నాణ్యమైన విద్య : ఎంపి సురేష్‌రెడ్డి

సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినదుకు వాకౌట్ చేశామన్నారు. సమాజంలో అసమానతలు తొలగించాలంటే విద్య అతి ముఖ్యమైందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ బాగా నమ్ముతారన్నారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సిఎం కెసిఆర్ అనేక రకాల చర్యలు తీసుకున్నారన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను వరంగల్ తీసుకెళ్లడంలో విజయం సాధించామన్నారు. నవోదయ విద్యాలయాలతో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తెలంగాణకు ఒక్క నవోదయ విద్యాలయం ఇవ్వలేకపోయారన్నారు. ప్రతి అంశంలో వన్ నేషన్, వన్ పాలసీ అంటారు. మరి అన్ని రాష్ట్రాలను అలా ఎందుకు చూడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒక జిల్లాలో నవోదయ ఏర్పాటు జరిగితే చుట్టూ పరిసరాల్లోని విద్యాలయాల్లో కూడా నాణ్యత పెరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News