Friday, December 20, 2024

నిరుద్యోగులను పట్టించుకోరా..?

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో టిఆర్‌ఎస్ వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించకపోవడంతో వాకౌట్ : లోక్‌సభాపక్షనేత నామా

TRS MPs Comments on Modi Govt

మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం : దేశంలోని నిరుద్యోగ సమస్యను కేంద్రం పట్టించుకో దా అని టిఆర్‌ఎస్ లోక్‌సభపక్షనేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో దేశవ్యాప్తంగా యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ అంశంపై చర్చించాలని తాము సభలో స్పీకర్‌కు వాయిదా తీర్మా నం ఇస్తే కనీసం చర్చకు అనుమతించకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగ సమస్యను చర్చించకపోవటంతో తాము లోక్‌సభ నుంచి వాకౌట్ చే సినట్లు నామా తెలిపారు. గురువారం అనంత రం మీడియాతో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2014లో 5.6శాతం నిరుద్యోగం ఉంటే ప్రస్తుతం 8.1శాతంకు పెరిగిందని ఆయన గుర్తుచేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (ఇండిపెడెంట్ ఏజెన్సీ) దేశ ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగుల గురించి ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే ఎనిమిది సం వత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ పతనమయ్యిందని ఆ యన వివరించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబి సి వర్గాల వారు ఇబ్బందిపడుతున్నారని ఆయన వెల్లడించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు పరిధిలో దాదాపు 16లక్షలపై గా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటినీ భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వపెద్దలు తాత్సారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. కానీ కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు.

గడిచిన 8 సంవత్సరాల్లో 23 పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ విభాగాలు మూసివేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశం లో నిరుద్యోగ శాతం పెరగడంతో ఆత్మహత్యలు అధికం అవుతున్నాయని, దేశంలో మూడు సం వత్సరాల్లో సుమారు 25వేల మంది నిరుద్యోగు లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేద న వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు బిజెపి ప్రభు త్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామినిచ్చిందని ఆ లెక్క ప్రకారం ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు చూపించాలన్నారు. యువత పక్షన టిఆర్‌ఎస్ పార్లమెంట్‌లో పోరా టం చేస్తుందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News