Monday, December 23, 2024

నిరాశామయం

- Advertisement -
- Advertisement -

TRS MPs criticise on Union Budget

ఆరోగ్యరంగాన్ని గాలికొదిలేశారు
తెలంగాణపై కేవలం వివక్షచూపడమే కాదు
రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నారు : కేంద్ర బడ్జెట్‌పై టిఆర్‌ఎస్ ఎంపిలు

బడ్జెట్‌పై టిఆర్‌ఎస్ ఎంపీల అసంతృప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌పై టిఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ బడ్జెట వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష నేత కె.కేశవరావు మాట్లాడుతూ, ఈ బడ్జెట్‌కు రూపం, స్వరూపం లేదు. బడ్జెట్ పూర్తిగా నిరాశ కలిగించిందన్నారు. మోడీ సర్కార్ తెలంగాణపై కత్తికట్టి పీడిస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తి పర్చేలా ఈ బడ్జెట్ లేదన్నారు. కొత్త రాష్ట్రానికి ఎటువంటి మద్దతు లేదన్నారు. రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఆ దిశగా చర్యలు లేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై రచ్చబండలోనూ చర్చ జరగాలన్నారు. ఆరోగ్య రంగాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కరోనా సమయంలోనూ నిధుల్లో కోత పెట్టారని విమర్శించారు. దశ, దిశ లేకుండా బడ్జెట్ ఉందన్నారు. ఉపాధి హామీ పథకానికి 25 శాతం నిధులు తగ్గించారని తెలిపారు. క్రిప్టో కరెన్సీపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదని అన్నారు.

30 శాతం పన్ను విధిస్తున్నారంటే దానిని లీగల్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. గ్రామీణ అభివృద్ధికి కూడా నిధుల్లో కోత పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. అత్యంత సమర్థవంతమైన ఎల్‌ఐసిని ప్రైవేటీకరణ చేయడం విచారకరమని అన్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష మాత్రమే చూపడం లేదని, పట్టి పీడిస్తోందని తెలిపారు. టిఆర్‌ఎస్ ఎంపి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో ప్రతి వర్గానికి అన్యా యం జరిగిందన్నారు. పేదల, కార్మికుల, ఉద్యోగుల, రైతుల అందరికీ బడ్జెట్ చేసిందేమీ లేదన్నారు. బడ్జెట్‌లో గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నా రు. కేంద్రం ప్రతి నగరాన్ని సమానంగా చూడాలని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ కూడా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటుందని మండి పడ్డారు. ఇటీవల ఉపసంహరించిన సాగు చట్టాలను కేంద్రం మళ్లీ వేరే రూపంలో తీసుకొచ్చే ప్రమాదం ఉందని తమకు అనుమానంప కలుగుతోందని ఎంపి కెఆర్ సురేష్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులపై అన్ని రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయని, కేంద్ర బడ్జెట్ ప్రజలకు ఉపయుక్తంగా లేదని టిఆర్‌ఎస్ ఎంపీలు విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News