Thursday, January 23, 2025

పార్లమెంటు సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోడీ వ్యాఖ్యలు సరికావు

- Advertisement -
- Advertisement -

TRS MPs fires over Modi's remarks on formation of Telangana

 

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు కవిత, రంజిత్‌రెడ్డి, నామా నాగేశ్వరరావుతో కలిసి టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తున్నదని విమర్శించారు.  ప్రధాని మోడీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోడీ వ్యాఖ్యలు సరికావన్నారు. రాష్ట్ర విభజన అనేది భావోద్వేగాలతో కూడిందని ఎంపీ కేకే చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News